సర్జికల్‌ మాస్కులు మంచివే!
close

ప్రధానాంశాలు

Published : 11/06/2021 04:36 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సర్జికల్‌ మాస్కులు మంచివే!

వాషింగ్టన్‌: కరోనా మహమ్మారి కట్టడిలో మాస్కుల సత్తా మరోసారి రుజువైంది. మాట్లాడేటప్పుడు, దగ్గినప్పుడు ఒక వ్యక్తి నుంచి వెలువడే చిన్నపాటి తుంపర్లను అడ్డుకోవడంలో సర్జికల్‌ మాస్కులు సమర్థంగా పనిచేస్తున్నట్లు అమెరికా శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మాస్కుల అంచుల వద్ద కొద్దిపాటి లీకేజీలు ఉన్నప్పటికీ మొత్తంమీద గాల్లోకి విడుదలయ్యే రేణువులు చాలా తక్కువగా ఉంటున్నట్లు వారు పేర్కొన్నారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం, ఇకాన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు ఈ పరిశోధన చేశారు. అత్యధిక సమర్థత కలిగిన ఎన్‌95 వంటి మాస్కులను ముఖానికి బిగుతుగా అతుక్కునేలా డిజైన్‌ చేస్తారు. సర్జికల్‌ మాస్కులు, వస్త్రంతో తయారైన ఇతర మాస్కులు ధరించినప్పుడు మాత్రం అంచుల్లో కొంత ఖాళీ ఉంటుంది. ఈ ఖాళీల గుండా రేణువులు బయటకు వస్తున్న తీరును శాస్త్రవేత్తలు పరిశీలించారు. మాట్లాడేటప్పుడు 70 శాతం మేర, దగ్గేటప్పుడు 90 శాతం మేర సమర్థతతో సర్జికల్‌ మాస్కులు పనిచేస్తున్నాయని సిమ్యులేషన్ల ద్వారా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఖాళీల గుండా వెలువడే గాలి వల్ల ఈ మాస్కుల సమర్థత తగ్గుతున్నప్పటికీ స్థూలంగా చూస్తే అవి గణనీయ స్థాయిలోనే రేణువులకు అడ్డుకట్ట వేస్తున్నాయని క్రిస్టోఫర్‌ చెప్పారు. మాస్కులు.. ఒక వ్యక్తి నుంచి వెలువడే గాలి దిశను మారుస్తాయని కూడా తెలిపారు. అందువల్ల ఎదురుగా ఉండే వ్యక్తికి రక్షణ లభిస్తుందన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
Array
(
  [4] => stdClass Object
    (
      [script_id] => 28
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1621231419270-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/ca-pub-8933329999391104-tag/ADP_41931_336x280_eenadu
      [script_params] => [336, 280]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 6
    )

  [5] => stdClass Object
    (
      [script_id] => 165
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461933978-0
      [script_div_size] => 2
      [script_dfp_id] => /103512698/adp_41931_300x250_eenadu_hc1
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 7
    )

  [6] => stdClass Object
    (
      [script_id] => 232
      [script_flag] => DEF
      [script_page] => 4
      [page_div_name] => div-gpt-ad-1615461508478-0
      [script_div_size] => 1
      [script_dfp_id] => /103512698/ADP_41931_300x250_eenadu_HC
      [script_params] => [300, 250]
      [script_isactive] => 1
      [script_page_type] => Web
      [script_order] => 8
    )

)
మరిన్ని

దేవతార్చన