ఫ్రెంచ్‌ ఓపెన్‌పై సింధు గురి

ప్రధానాంశాలు

Published : 26/10/2021 02:57 IST

ఫ్రెంచ్‌ ఓపెన్‌పై సింధు గురి

పారిస్‌: భారత స్టార్‌ షట్లర్‌ పి.వి.సింధు ఫ్రెంచ్‌ ఓపెన్‌ సూపర్‌ 750 టోర్నీపై దృష్టిసారించింది. డెన్మార్క్‌ ఓపెన్‌లో క్వార్టర్‌ఫైనల్లో నిరాశపరిచిన సింధు.. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో టైటిల్‌పై గురిపెట్టింది. మంగళవారం ప్రారంభంకానున్న ఈ టోర్నీలో మహిళల సింగిల్స్‌ తొలి రౌండ్లో జూలీ జాకోబ్‌సెన్‌ (డెన్మార్క్‌)తో మూడో సీడ్‌ సింధు తలపడుతుంది. మరో స్టార్‌ క్రీడాకారిణి సైనా నెహ్వాల్‌ తొలి రౌండ్లో సయాక తకహాషి (జపాన్‌)తో పోటీపడుతుంది. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో టాప్‌ సీడ్‌ కెంటొ మొమొట (జపాన్‌)తో శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌తో సాయిప్రణీత్‌, జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)తో సమీర్‌వర్మ, బ్రైస్‌ లెవెర్‌దెజ్‌ (ఫ్రాన్స్‌)తో కశ్యప్‌ తలపడతారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన