దిల్లీకి మళ్లీ చిటపటల్లేని దీపావళే

ప్రధానాంశాలు

Updated : 29/09/2021 06:43 IST

దిల్లీకి మళ్లీ చిటపటల్లేని దీపావళే

 2022 జనవరి 1దాకా టపాసుల ఊసెత్తొద్దు

రోజువారీ కార్యాచరణ నివేదిక కోరిన డీపీసీసీ

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో టపాకాయల విక్రయాలు, కాల్చడంపై 2022 జనవరి 1వ తేదీ దాకా నిషేధం విధిస్తున్నట్లు దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి (డీపీసీసీ) మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా జాతీయ హరిత ట్రైబ్యునల్‌ దిల్లీలో ఈ విధమైన నిషేధం విధించిన విషయం తెలిసిందే. ‘మన జీవితాలు కాపాడుకోవాలంటే తప్పనిసరి’ అంటూ దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పక్షం రోజుల కిందటే బాణసంచాపై నిషేధం ప్రకటించారు. డీపీసీసీ ఉత్తర్వుల మేరకు.. కొవిడ్‌-19 మహమ్మారి మరో ఉద్ధృతి పొంచి ఉన్నట్లు పలువురు నిపుణులు హెచ్చరిస్తున్నారు. రానున్న దీపావళి పండుగ సందర్భంగా జనం బాణసంచా కాల్చి, పెద్దఎత్తున వేడుకల్లో పాల్గొంటే సామాజిక దూరం నిబంధన పటాపంచలు అవుతుంది. మరోవైపు.. వాతావరణ కాలుష్యం మరింత పెరిగి దిల్లీ నగరవాసులకు ఊపిరితిత్తుల్లో ఇబ్బందుల వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వేధించే ప్రమాదం ఉంది. ఈ కారణంగా టపాసుల విక్రయాలు, కాల్చడంపై విధిస్తున్న నిషేధం పక్కాగా అమలయ్యేలా చూడాలని జిల్లా న్యాయమూర్తులు, పోలీస్‌ డిప్యూటీ కమిషనర్లకు దిల్లీ కాలుష్య నియంత్రణ మండలి సూచనలు జారీ చేసింది. నిషేధం అమలు తీరుపై ప్రతిరోజూ కార్యాచరణ నివేదిక సమర్పించాలని ఆదేశించింది.  

 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన