రామాయణంలో హాస్యం జోడించడంపై రగడ

ప్రధానాంశాలు

Published : 18/10/2021 05:18 IST

రామాయణంలో హాస్యం జోడించడంపై రగడ

క్షమాపణలు చెప్పిన ఎయిమ్స్‌ విద్యార్థుల సంఘం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలోని ఎయిమ్స్‌ విద్యార్థులు ప్రదర్శించిన రామ్‌లీలా స్కిట్‌లో హాస్యం జోడించడం తాజాగా వివాదాస్పదమైంది! మతపరమైన మనోభావాలు దెబ్బతీశారంటూ వారిపై సామాజిక మాధ్యమాల్లో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఎయిమ్స్‌ విద్యార్థుల సంఘం ఆదివారం క్షమాపణలు తెలిపింది. దిల్లీ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్‌ మొదటి సంవత్సరం చదువుతున్న కొందరు విద్యార్థులు దసరా సందర్భంగా తమ ప్రాంగణంలో రామ్‌లీలా స్కిట్‌ చేశారు. అందులో ఆధునికత, హాస్యం జోడించారు. ఆ వీడియో క్లిప్‌లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసి నెటిజన్లు మండిపడ్డారు. మతపరమైన మనోభావాలను అగౌరవపర్చారంటూ విమర్శలు గుప్పించారు. దీంతో ఎయిమ్స్‌ విద్యార్థుల సంఘం ట్విటర్‌ వేదికగా క్షమాపణలు తెలియజేసింది. మున్ముందు అలాంటివి చోటుచేసుకోకుండా జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొంది. విద్యార్థులు ప్రదర్శించిన స్కిట్‌.. అధికారిక వేడుక/కార్యక్రమాల్లో భాగం కాదని ఓ అధికారి స్పష్టం చేశారు. స్కిట్‌లో పాత్రధారిగా ఉన్న విద్యార్థి ఒకరు.. క్షమాపణలు కోరుతూ ఆన్‌లైన్‌లో వీడియో ఉంచారు. పిల్లతనంతో తాము అలా చేశామని, తర్వాత వీడియో చూస్తే తమకే సిగ్గుగా అనిపించిందని చెప్పారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన