అంతర్జాతీయ నిబంధనల్ని ఏ ఒక్క దేశమూ నిర్దేశించలేదు

ప్రధానాంశాలు

Published : 26/10/2021 05:19 IST

అంతర్జాతీయ నిబంధనల్ని ఏ ఒక్క దేశమూ నిర్దేశించలేదు

అమెరికాకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ చురకలు

బీజింగ్‌: ఐక్యరాజ్య సమితి (ఐరాస) రూపొందించిన అంతర్జాతీయ న్యాయ నిబంధనలను ఎలాంటి మినహాయింపుల్లేకుండా ప్రతి దేశమూ పాటించాల్సిందేనని చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్‌ అన్నారు. అంతర్జాతీయ నియమ నిబంధనలను ఏ ఒక్క దేశమూ సొంతంగా రూపొందించలేదంటూ అగ్రరాజ్యం అమెరికాకు చురకలు చేశారు. ఐరాస భద్రత మండలిలో వీటో అధికారంతో పాటు శాశ్వత సభ్యత్వాన్ని చైనా పొంది 50 ఏళ్లు అయిన సందర్భంగా బీజింగ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో మాట్లాడుతూ చ్కీజిజిన్‌పింగ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ఐరాసలో సభ్యులుగా ఉన్న 193 దేశాలు సమష్టిగా మాత్రమే అంతర్జాతీయ నిబంధనలను రూపొందించగలవని, ఒక్క దేశమో, కొన్ని దేశాల కూటమో ఆ పనిచేయలేదని స్పష్టం చేశారు. మానవజాతి సర్వోన్నత లక్ష్యమైన శాంతి, అభివృద్ధి సాధనలో ఐరాస మరింత సానుకూల పాత్రను పోషించాల్సి ఉంటుందన్నారు. అమెరికా, చైనా మధ్య పలు అంశాల్లో విభేదాలు తీవ్రమవుతున్న ప్రస్తుత సమయంలో జిన్‌పింగ్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన