
తాజా వార్తలు
రాబర్ట్ వాద్రా ఉద్విగ్నభరిత పోస్టు
దిల్లీ: కాంగ్రెస్ పార్టీ ఉత్తర్‌ప్రదేశ్ తూర్పు విభాగానికి ప్రధాన కార్యదర్శి హోదాలో ప్రియాంక గాంధీ వాద్రా తొలిసారిగా లఖ్‌నవూలో రోడ్ షో చేపట్టారు. ఈ సందర్భంగా ఆమె భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా అభినందనలు తెలుపుతూ సోషల్‌మీడియా వేదికగా ఉద్విగ్నభరిత పోస్టు చేశారు. ‘ఈ విష రాజకీయ వాతావరణంలో నా భార్యను జాగ్రత్తగా చూసుకోండి’ అని ప్రజలను కోరారు.
‘ప్రజలకు సేవ చేసేందుకు నువ్వు ప్రారంభించిన ఈ సరికొత్త ప్రయాణంలో నీకు అంతా మంచే జరగాలి పి(ప్రియాంకను ఉద్దేశిస్తూ). నువ్వు నాకు మంచి స్నేహితురాలివి. పరిపూర్ణమైన భార్యవి. నా పిల్లలకు గొప్ప తల్లివి. నేడు దేశంలో ప్రతీకార, విషపూరిత రాజకీయ వాతావరణం ఉంది. కానీ ప్రజలకు సేవ చేయడం ఆమె బాధ్యత అని నాకు తెలుసు. అందుకే ఆమెను ఈ దేశ ప్రజలకు అప్పగిస్తున్నాం. జాగ్రత్తగా చూసుకోండి ప్లీజ్’ అని రాబర్ట్ వాద్రా పోస్టు చేశారు.
ప్రియాంక ఇటీవల ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్నారు. ఈ హోదాలో తొలిసారిగా నేడు లఖ్‌నవూలో రోడ్ షో నిర్వహించారు. తొలి పర్యటనలో ప్రియాంక వెంట ఆమె సోదరుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఉన్నారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
- వివాహం వద్దంటూ పీటలపై నుంచి వెళ్లిన వధువు
- భారత్‌కు ఒలింపిక్ కమిటీ షాక్
- మరోసారి కవ్వింపు వ్యాఖ్యలు చేసిన అఫ్రిది
- ప్రాణం తీసిన పానీ పూరి
- రూ.35 లక్షలు చెల్లించిన మహేష్‌బాబు మల్టీప్లెక్స్
- ‘భారతీయుడు’ ఆగింది ఇందుకేనట..
- రాజధాని రైళ్లకు ఇక ‘పుష్-పుల్’
- పశువులంటే నాకు ప్రాణం
- ఆమె 3.2.. అతడు 5.4 అంగుళాలు
- మహిళ కంటిలో 15 సెం.మీ. నులిపురుగు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
