close

తాజా వార్తలు

ఆస్పత్రి బెడ్‌పై రూ.కోటి వాచ్‌ ధరించిన పాండ్య

ముంబయి: అరంగేట్రం చేసిన అనతి కాలంలోనే టీమిండియాలో కీలక ఆటగాడిగా మారాడు హార్దిక్‌ పాండ్య. బ్యాటు, బంతితో రాణించగల తన ఆల్‌రౌండ్‌ సామర్థ్యంతో జట్టుకు సమతూకం తీసుకొచ్చాడు. బ్యాటింగ్‌, బౌలింగ్‌, ఫీల్డింగ్‌ను దృష్టిలో పెట్టుకొనే అతడి పనిభారాన్ని సెలక్టర్లు పర్యవేక్షిస్తున్నారు. వచ్చే ఏడాది ఆస్ట్రేలియాలో టీ20 ప్రపంచకప్‌ నేపథ్యంలో అతడు అన్ని సిరీస్‌లు ఆడాల్సి ఉంది. అలాంటిది దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు దూరమవ్వడం అందరినీ ఆశ్చర్యపరిచింది. వెన్ను దిగువ భాగంలో గాయమే ఇందుకు కారణం.

ఆసియా కప్‌ ఆడేటప్పుడే హార్దిక్‌ పాండ్య వెన్ను గాయంతో బాధపడ్డాడు. మధ్యలోనే టోర్నీకి దూరమయ్యాడు. విశ్రాంతి తీసుకొన్నాడు. ఆ తర్వాత ప్రపంచకప్‌ ఆడాడు. ఐతే అతడికి వెన్నుగాయం మళ్లీ తిరగబెట్టింది. నొప్పి విషయం చెప్పడంతో బీసీసీఐ అతడిని బ్రిటన్‌కు పంపించి శస్త్రచికిత్స చేయింది. మళ్లీ మైదానంలో అడుగు పెట్టాలంటే కనీసం 6 నెలల విశ్రాంతి అవసరం. అతడు త్వరగా కోలుకోవాలని సురేశ్‌ రైనా, మయాంక్‌ అగర్వాల్‌ సహా జట్టు సభ్యులు ఆశించారు.

శస్త్రచికిత్స తర్వాత పాండ్య ఇన్‌స్టాలో అందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు. త్వరలోనే మీ ముందుకు వస్తానంటూ ఓ చిత్రం పెట్టాడు. ఆస్పత్రి పడక మీదుండి తీసుకున్న ఆ చిత్రంలో పాండ్య తన చేతికి ఓ గడియారం ధరించాడు. దాదాపు దాని ధర రూ.కోటీ 30లక్షలకు పైగా ఉంటుందని అంచనా. అందుకే అందరి దృష్టి దానిపైనే పడింది. అభిమానులు సోషల్‌ మీడియాలో దీనిపై చర్చిస్తున్నారు. అది పాటెక్‌ ఫిలిఫ్‌ నాటిలస్‌ శ్రేణికి చెందిన గడియారం. ఈ గడియారానికి చాలా డిమాండ్‌ ఉంటుంది. హార్దిక్‌ పాండ్యకు విలాసవంతమైన జీవితం అంటే ఇష్టం. ఒకప్పుడు పేదరికంలో పెరిగిన అతడు కష్టపడి తన కలలను నెరవేర్చుకున్నాడు. లాంబోర్గిని వంటి అత్యంత విలాసవంతమైన కారును కొనుగోలు చేశాడు. ‘గడియారం పెట్టుకొనే శస్త్రచికిత్స చేయించుకున్నావా ఏంటి? హహహ..’ అని బాలీవుడ్‌, టాలీవుడ్‌ నటి, మిస్టర్‌ మజ్నూ చిత్రంలో మాధవిగా నటించిన ఇజబెల్‌ లీట్‌ ట్వీట్‌ చేయగా పాండ్య ‘ఎప్పుడూ..’ అని బదులిచ్చాడు. మరికొందరు అభిమానులూ గడియారంపై వ్యాఖ్యలు చేశారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
ఛాంపియన్

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.