
తాజా వార్తలు
1. ఇష్టం వచ్చినట్లు చేస్తే ఊరుకోం: చంద్రబాబు
వైకాపా ప్రజాప్రతినిధులు ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తే చూస్తూ ఊరుకోబోమని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రజల్లో ఎండగడతామని హెచ్చరించారు. గుంటూరులోని పార్టీ కార్యాలయంలో నెల్లూరు జిల్లా కార్యకర్తలతో ఆయన సమావేశమయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ నెల్లూరు నాయకులను పిలిచి పులివెందుల పంచాయతీ చేస్తున్నారని మండిపడ్డారు. వైకాపా ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డికి రెండు గంటల్లో బెయిల్ ఇచ్చి ప్రజలకు ఎలాంటి సందేశం ఇస్తున్నారని నిలదీశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
2. జిన్‌పింగ్ పర్యటనలో ఏ ఒప్పందాలు ఉండవు
చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ భారత పర్యటన సందర్భంగా ఇరు దేశాల మధ్య ఎలాంటి ఒప్పందాలు, సంయుక్త అధికారిక ప్రకటనలు ఉండవని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కేవలం ఉభయదేశాల ప్రజల మధ్య సంబంధాల్ని మరింత ముందుకు తీసుకెళ్లడంలో భాగంగానే ఈ భేటీ జరుగుతుందన్నారు. అక్టోబర్ 11, 12న జిన్‌పింగ్ భారత్‌లో పర్యటించనున్నారు. ప్రధాని మోదీతో చెన్నై సమీపంలోని చరిత్రాత్మక నగరం మహాబలిపురంలో సమావేశమవుతారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
3. కలిసి పనిచేస్తాం: కాకాణి, కోటంరెడ్డి
పార్టీకోసం జిల్లాలో నేతలంతా కలిసి పనిచేస్తామని నెల్లూరు జిల్లాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు కాకాణి గోవర్దన్‌రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి స్పష్టం చేశారు. జిల్లాలో వైకాపా నేతల మధ్య ఆధిపత్యపోరుపై ఇద్దరు ఎమ్మెల్యేలతో ముఖ్యమంత్రి జగన్ సమావేశమయ్యారు. సీఎంతో భేటీ అనంతరం కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి, కాకాణి మీడియాతో మాట్లాడారు. రైతు భరోసా, సీఎం సభపై మాత్రమే చర్చించామన్నారు. సభను బాగా నిర్వహించాలని ఏపీ సీఎం జగన్ కోరారని చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
4. జియో: ఇతర నెట్వర్క్కి కాల్ చేస్తే ఛార్జి
ప్రముఖ టెలికాం కంపెనీ జియో కీలక ప్రకటన చేసింది. ఇకపై జియో నెట్వర్క్ నుంచి ఇతర నెట్‌వర్క్‌లకు చేసే కాల్స్‌కు నిమిషానికి 6 పైసలు చొప్పున వసూలు చేయనున్నట్లు ప్రకటించింది. అయితే, వినియోగదారులు చెల్లించిన మొత్తానికి బదులుగా డేటాను తిరిగి అందివ్వనున్నామని ప్రకటించింది. ఐయూసీ ఛార్జీల విషయంలో ట్రాయ్ ఇచ్చిన నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
5. ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు
ఏపీలో అఖిలభారత సర్వీసు అధికారులను బదిలీ చేయటంతో పాటు పోస్టింగ్‌లు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ స్టేట్ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఉన్న సంజయ్‌గుప్తాను బదిలీ చేస్తూ అటవీశాఖ చీఫ్ కన్సర్వేటర్కు రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది. పురపాలకశాఖ కమిషనర్ విజయ్‌కుమార్‌కు ఏపీ ప్లానింగ్ సొసైటీ సీఈవోగా అదనపు బాధ్యతలు అప్పగించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
6. కేటీఆర్ అలానే పాపులర్ అయ్యారు: పొన్నం
ఆర్టీసీ కార్మికులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించమని కోరుతున్నా ప్రభుత్వానికి పట్టడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. ఏ అంశంపై అయినా అవసరమున్నా లేకున్నా ట్విటర్లో స్పందించే మంత్రి కేటీఆర్.. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ఈ మేరకు పొన్నం ఓ ప్రకటన విడుదల చేశారు. కేటీఆర్ అంటే కల్వకుంట్ల తారక రామారావు కంటే కల్వకుంట్ల ట్విటర్ రావుగానే బాగా ప్రచారంలోకి వచ్చారని ఆయన ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
7. యూరియా కొరత రానివ్వం: మంత్రి నిరంజన్‌రెడ్డి
తెలంగాణలో రబీ సీజన్‌కు ఎరువుల కొరత రాకుండా కేంద్ర ప్రభుత్వంతో సమన్వయం చేసుకుని అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి తెలిపారు. బుధవారం దిల్లీలో కేంద్ర రసాయన, ఎరువులశాఖ మంత్రి సదానందగౌడను కలిసిన ఆయన రబీకి యూరియా కేటాయింపులపై వినతిపత్రం అందజేశారు. ఈఏడాది వర్షాలు కాస్త ఆలస్యమైనా..రాష్ట్రంలో అధికంగా కోటి 11లక్షల ఎకరాల భూమి సాగులో ఉందని మంత్రి తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
8. ఆ కుటుంబాలకు రూ.5.5 లక్షల ప్యాకేజీ
పొరుగుదేశం దురాక్రమణ సమయంలో పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి దేశంలో వేర్వేరు ప్రాంతాల్లో నివసించి తిరిగి జమ్మూకశ్మీర్‌లో స్థిరపడిన కుటుంబాలకు కేంద్రం పునరావాస ప్యాకేజీ ప్రకటించింది. ఒక్కో కుటుంబానికి రూ.5.5 లక్షల చొప్పున మొత్తం 5,300 కుటుంబాలకు అందజేయనుంది. ఈ మేరకు ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ భేటీలో బుధవారం ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
9. ఏపీ, తెలంగాణ వివరణ కోరిన హోంశాఖ
ఏపీ పునర్విభజన చట్టంపై దిల్లీలోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా నేతృత్వంలో కీలక సమావేశం ముగిసింది. దాదాపు రెండున్నర గంటల పాటు జరిగిన ఈసమావేశంలో షెడ్యూల్ 9, 10 జాబితాలోని సంస్థల విభజనపై ప్రధానంగా చర్చించారు. సింగరేణి కాలరీస్, ఆర్టీసీ, పౌరసరఫరా సంస్థలు, కార్పొరేషన్లపై కూడా చర్చ జరిగింది. సంస్థల విభజనపై రెండు రాష్ట్రాలు లేవనెత్తిన అంశాలపై హోంశాఖ వివరణ కోరింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
10. ‘సైరా’కి తమిళి సై ప్రశంసలు
‘సైరా’ చిత్రబృందాన్ని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ప్రశంసించారు. మెగాస్టార్ చిరంజీవి ఇటీవల గవర్నర్‌ను కలిసి ఆయన నటించిన ‘సైరా’ చిత్రాన్ని చూడాలని కోరిన విషయం తెలిసిందే. అయితే తాజాగా తమిళి సై తన కుటుంబసభ్యులతో కలిసి ‘సైరా’ సినిమాని చూశారు. ఈ సందర్భంగా ఆమె ‘సైరా’ సినిమా చాలా బాగుందని తెలిపారు. ఇంతటి గొప్ప చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన చిత్రబృందాన్ని ఆమె ప్రశంసించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- విడాకులిప్పించి మరీ అత్యాచారం...
- రివ్యూ: వెంకీ మామ
- వామ్మో! ఈమె ఎంత ధైర్యవంతురాలో..
- స్నానాల గదిలో సీసీ కెమెరా ఏర్పాటుకు యత్నం
- ఆయేషా మీరా భౌతికకాయానికి ‘రీ-పోస్టుమార్టమ్’..?
- బాలీవుడ్ భామతో పంత్ డేటింగ్?
- నీవు లేని జీవితం ఊహించలేను: రోహిత్
- వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో గెలుస్తాం: మోదీ
- ఎన్‌కౌంటర్‌పై జ్యుడీషియల్ విచారణ... పోలీసుశాఖలో అలజడి
- పఠాన్, రహానె మధ్య మాటల యుద్ధం
ఎక్కువ మంది చదివినవి (Most Read)
