
తాజా వార్తలు
బెంగళూరు: కాంగ్రెస్ నేత, కర్ణాటక మాజీ ఉపముఖ్యమంత్రి జి. పరమేశ్వర వ్యక్తిగత సహాయకుడు, అత్యంత నమ్మకస్తుడు రమేశ్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా గ్రౌండ్స్‌కు సమీపంలోని చెట్టుకు ఉరివేసుకుని రమేశ్ ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
రమేశ్ గత ఎనిమిదేళ్లుగా పరమేశ్వరకు పీఏగా పనిచేస్తున్నాడు. ఆయనకు అత్యంత నమ్మకస్తుడు కూడా. రెండు రోజుల క్రితం పరమేశ్వరకు చెందిన ఇళ్లు, కార్యాలయాల్లో ఐటీ శాఖ పెద్ద ఎత్తున సోదాలు చేపట్టిన విషయం తెలిసిందే. సోదాల సమయంలో రమేశ్‌ను కూడా విచారించారు. ఈ నేపథ్యంలో రమేశ్ ఆత్మహత్య చేసుకోవడం కర్ణాటక రాజకీయాల్లో కలకలం రేపుతోంది.
రమేశ్ మృతిపై పరమేశ్వర విచారం వ్యక్తం చేశారు. ‘రమేశ్ ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడో తెలియట్లేదు. ఈ రోజు ఉదయం కూడా నేను తనతో మాట్లాడాను. ఐటీ దాడుల గురించి ఎలాంటి భయాందోళనలు అవసరం లేదని, పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొందామని చెప్పాను’ అని పరమేశ్వర తెలిపారు. మరోవైపు రమేశ్ ఆత్మహత్య చేసుకోవడంతో శనివారం ఐటీ అధికారులు మరోసారి పరవేశ్వర నివాసం, కార్యాలయాల్లో సోదాలు చేపట్టారు.
ఐటీ వేధింపుల వల్లే రమేశ్ ఆత్మహత్య
కాగా.. రమేశ్ ఆత్మహత్యపై విచారం వ్యక్తం చేసిన కర్ణాటక కాంగ్రెస్.. ఐటీ అధికారుల తీరుపై మండిపడింది. భాజపా ఒత్తిడితో ఐటీ అధికారుల వేధింపుల కారణంగా రమేశ్ బలయ్యాడని ఆరోపించింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొంది.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్య కేసు నిందితుల ఎన్కౌంటర్
- దిశ ఆధారాలపై ‘సూపర్ లైట్’
- జీవచ్ఛవాన్నీ కాల్చేశారు..!
- పెళ్లి వారమండీ.. జైలుకు పదండి..!
- మహిళకు పాము కాటు.. డోలీ కట్టి 8.కి.మీ...
- శబరిమల తీర్పుపై సుప్రీం కీలక వ్యాఖ్యలు
- కొల్లగొట్టింది రూ.100కోట్లకు పైనే!
- ‘ఆ విషయంలో రాముడూ గ్యారెంటీ ఇవ్వలేడు’
- తెలుగు రాష్ట్రాలు.. ఆసక్తికర చిత్రాలు
- ఒక్కరికే ఛాన్స్: కోహ్లీ
ఎక్కువ మంది చదివినవి (Most Read)
