close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 9 PM

1. బంగారు బాతును చంపేస్తున్నారు: చంద్రబాబు

రివర్స్‌ టెండరింగ్‌తో రూ.750 కోట్లు మిగిల్చామని వైకాపా నేతలు చెబుతున్నారని.. కానీ రూ.7,500 కోట్లు నష్టం వస్తుందని తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శ్రీకాకుళంలో పార్టీ నేతలతో సమీక్ష అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రివర్స్‌ టెండరింగ్‌ కాదు.. అది రిజర్వ్‌ టెండరింగ్‌ అని పునరుద్ఘాటించారు.  ప్రపంచమంతా అమరావతి గురించి చర్చించుకునేలా చేశానన్నారు. బంగారు గుడ్లు పెట్టే బాతును చేతికి ఇస్తే దాన్ని చంపేస్తున్నారని వైకాపా నేతలపై మండిపడ్డారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. రేవంత్‌ నిర్ణయంపై కాంగ్రెస్‌లో కాక

తెలంగాణ కాంగ్రెస్‌లో నేతల మధ్య భేదాభిప్రాయాలు మరోసారి బహిర్గతమయ్యాయి. తమకు సమాచారమివ్వకుండా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు సీనియర్‌ నేతలు గుర్రుగా ఉన్నారు. వారి ఆవేదనను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క వద్ద వ్యక్తం చేసినట్టు సమాచారం. నేతలెవరికి సమాచారం ఇవ్వకుండా పీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి ప్రగతిభవన్‌ ముట్టడికి పిలుపునిచ్చారని నాయకులు భట్టి వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. సరిహద్దు వెంబడి మళ్లీ డ్రోన్ల కదలికలు

పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌, హుస్సేన్‌వాలా సెక్టర్‌లలో పెద్ద ఎత్తున సరిహద్దు భద్రతా దళాలను (బీఎస్‌ఎఫ్‌) మోహరించారు. సోమవారం రాత్రి పాక్‌ గగన తలం నుంచి భారత్‌ వైపునకు వస్తున్న డ్రోన్లను గుర్తించినందువల్ల బందోబస్తును  పెంచినట్లు బీఎస్‌ఎఫ్‌ వర్గాలు తెలిపాయి. నిరంతరం పెట్రోలింగ్‌ జరుపుతున్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది ఇప్పటికి మూడు డ్రోన్లను కూల్చేసినట్లు అధికారులు వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. మలేషియాకు భారత వంటనూనె వర్తకుల షాక్‌!

భారత వంట నూనె వర్తకుల సంఘం మలేషియాకు  గట్టి షాక్‌ ఇచ్చింది. ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడే నిర్ణయం తీసుకుంది. జమ్మూకశ్మీర్‌ వ్యవహారంలో పాక్‌కు అనుకూలమైన రీతిలో వ్యవహరిస్తున్న మలేషియా నుంచి పామాయిల్‌ను కొనగోలు చేయొద్దని సభ్యులకు సూచించింది. ఈ మేరకు ముంబయిలో సాల్వెంట్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ అసోసియేషన్‌ (ఎస్‌ఈఏఐ) ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. కశ్మీర్‌ తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా సత్యపాల్‌!

కేంద్ర పాలిత ప్రాంతంగా మారిన జమ్ము కశ్మీర్‌కు తొలి లెఫ్టినెంట్‌ గవర్నర్‌గా ప్రస్తుత గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ నియమితులు కానున్నట్లు తెలుస్తోంది. అక్టోబరు 31 తర్వాతి నుంచి జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌లు అధికారికంగా కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారనున్నందున అనంతరం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ను నియమిస్తారు. అయితే, ప్రభుత్వ వర్గాలు వెల్లడించిన వివరాల ప్రకారం.. కశ్మీర్‌, లద్దాఖ్‌లో ప్రస్తుత పరిస్థితులు సత్యపాల్‌ మాలిక్‌కు తెలిసినంతగా మరొకరికి అవగాహన ఉండకపోవచ్చనే భావనలో కేంద్రం ఉన్నట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పరిపాలనపై తన ఆలోచనల్ని తెలిపారు: బెనర్జీ

ప్రధాని మోదీతో సమావేశమైన అనంతరం నోబెల్‌ గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా మోదీ సమావేశంలో మాట్లాడిన విషయాల్ని వివరిస్తూ.. ‘నన్ను మోదీ వ్యతిరేక వ్యాఖ్యలు చేసేలా మీడియా ప్రయత్నం చేస్తోందన్న జోక్‌తో ఆయన సమావేశాన్ని ప్రారంభించారు. ఆయన ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు, మీరు ఏం చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఆయనకు తెలుసు. భారతదేశ పరిపాలన గురించి ఆయన ఆలోచించే విధానాన్ని నాకు వివరించారు’ అని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ద్విచక్రవాహన ఎగుమతుల్లో వృద్ధి

దేశీయంగా వాహన రంగం తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొంటున్న తరుణంలో ద్విచక్రవాహనాల ఎగుమతుల గణాంకాలు మాత్రం కాస్త ఊరట కలిగిస్తున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి అర్ధభాగంలో ద్విచక్రవాహనాల ఎగుమతులు నాలుగు శాతం పెరిగినట్లు ‘సొసైటీ ఆఫ్‌ ఇండియా ఆటోమొబైల్స్‌ మ్యానుఫ్యాక్చరర్స్‌’(ఎస్‌ఐఏఎం) తెలిపింది. మోపెడ్‌, స్కూటర్లు, మోటార్‌సైకిళ్లు కలిపి తొలి అర్ధభాగంలో 17,93,957యూనిట్లు ఎగుమతి అయినట్లు తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. కశ్మీర్‌, లద్దాఖ్‌లో పెరగనున్న ఉద్యోగుల జీతాలు

కేంద్ర పాలిత ప్రాంతాలైన జమ్ము కశ్మీర్‌, లద్దాఖ్‌లలో పని చేసే ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు పెరగనున్నాయి. ఏడవ కేంద్ర పే కమిషన్‌ (సీపీసీ) కింద వర్తించే అలవెన్సుల చెల్లింపులకు మోదీ ప్రభుత్వం మంగళవారం ఆమోదం తెలిపింది. ఈ నిర్ణయం అక్టోబరు నెలాఖరు నుంచి అమల్లోకి రానుంది. దీనికి సంబంధించి హోం మంత్రిత్వశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ అలవెన్సుల చెల్లింపుల వల్ల 4.5 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. బంగ్లా క్రికెటర్ల సమ్మె వెనక ‘కుట్ర కోణం’!

బంగ్లాదేశ్‌ క్రికెటర్లు హఠాత్తుగా సమ్మెకు పిలుపునివ్వడంతో టీమిండియాతో సిరీస్‌పై నీలిమబ్బులు కమ్ముకున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలో క్రికెట్‌ను అస్థిరపరిచేందుకు కుట్ర ఏమైనా జరుగుతోందా అని బీసీబీ అధ్యక్షుడు నజ్ముల్‌ హసన్‌ అనుమానం వ్యక్తంచేస్తున్నారు. బంగ్లా అగ్రశ్రేణి ఆటగాళ్లు షకిబ్‌ అల్‌ హసన్‌, మహ్మదుల్లా, ముష్ఫికర్‌ రహీమ్‌ తమ డిమాండ్లు నెరవేర్చేంత వరకు సమ్మె చేస్తామని సోమవారం ప్రకటించిన సంగతి తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. టెస్టు ర్యాంకింగ్స్‌లో కోహ్లీసేన పాయింట్లెన్నో తెలుసా!

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌లో టీమిండియా తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకుంది. 240 పాయింట్లతో ఎవ్వరికీ అందనంత ఎత్తులో నిలిచింది. అగ్రస్థానంలో కొనసాగుతోంది. దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టెస్టులో కోహ్లీసేన 202 పరుగుల తేడాత ఘన విజయం సాధించింది. ఆ జట్టును 3-0తో వైట్‌వాష్ చేయడంతో మ్యాచ్‌కు 40 చొప్పున మొత్తం 120 పాయింట్లను సొంతం చేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.