
తాజా వార్తలు
కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు సూచన
బెంగళూరు: టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేయాలనే నిర్ణయాన్ని పునఃపరిశీలించుకోవాలని కర్ణాటక హైకోర్టు ఆ రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. ఇందుకు కోర్టు రెండు నెలల గడువు విధించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఒకా, జస్టిస్ ఎస్ఆర్ కృష్ణ కుమార్తో కూడిన ధర్మాసనం బుధవారం ఈ ఆదేశాలు వెలువరించింది. ఏటా నవంబరు 10న జరిపే టిప్పు సుల్తాన్ జయంతి రద్దు నిర్ణయాన్ని ఒకేరోజు ఏకపక్షంగా ఎలా తీసుకుంటారని ధర్మాసనం ప్రశ్నించింది. 18వ శతాబ్దంలో మైసూరు సంస్థానాన్ని పాలించిన రాజు టిప్పు సుల్తాన్ జయంతి వేడుకలను రద్దు చేయాలని యడియూరప్ప ప్రభుత్వం గతంలో నిర్ణయం తీసుకుంది. దీనిపై కొంత మంది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
కాంగ్రెస్-జనతాదళ్ సెక్యులర్ సంకీర్ణ ప్రభుత్వంలో టిప్పు జయంతి వేడుకలు నిర్వహించేవారు. దీనిపై భాజపా నాయకులు తీవ్రమైన విమర్శలు చేశారు. ఈ వేడుకలు మైనారిటీ ప్రజలను మెప్పించేందుకు చేస్తున్నారని ఆరోపించారు.
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
ఛాంపియన్
- దిశ హత్యోదంతం.. తాజా వీడియో
- అందుకే రష్మి నా లైఫ్: సుడిగాలి సుధీర్
- నిందితుల్లో ఇద్దరు మైనర్లు?
- ఎన్కౌంటర్ స్థలంలో.. హల్చల్!
- ఆ ఇద్దరికీ ఎంపీ టికెట్లు ఎలా ఇచ్చారు?:తెదేపా
- నిర్భయ దోషులకు త్వరలో ఉరి
- భాజపాకు తెరాస షాక్!
- శరణార్థులకు పౌరసత్వం
- ‘అమిత్ షాపై ఆంక్షల్ని పరిశీలించండి’
- లూప్ ఎంతకాలం ఉంచుకోవచ్చు?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
