close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ - 9 AM

1. మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ఫడణవీస్‌

మహారాష్ట్ర రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడణవీస్‌ ప్రమాణస్వీకారం చేశారు. ఉపముఖ్యమంత్రిగా ఎన్సీపీకి చెందిన అజిత్‌ పవార్‌ ప్రమాణం చేశారు. వీరితో గవర్నర్‌ భగత్‌సింగ్‌ కోశ్యారీ శనివారం ఉదయం ప్రామాణం చేయించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

2. ఘోర రోడ్డు ప్రమాదం..11 మంది మృతి

రాజస్థాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రెండు మినీ బస్సులు ఢీకొన్న ఘటనలో 11మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు ఉన్నట్లు సమాచారం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం వేకువజామున 3గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. నాగోర్‌ జిల్లాలోని కుచామన్‌ పట్టణ సమీపంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

3. ఆర్టీసీకి కొత్త రూపు

ఆర్టీసీకి కొత్త రూపం ఇచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆయత్తం అవుతోంది. ఆర్థికంగా కుదేలైన ఆర్టీసీని గట్టెక్కించాలంటే ప్రైవేటీకరణకు తెర తీయాల్సిందేనన్న అభిప్రాయానికి వచ్చింది. ఈ క్రమంలో స్వచ్ఛంద పదవీ విరమణ పథకం(వాలంటరీ రిటైర్మెంట్‌ స్కీమ్‌- వీఆర్‌ఎస్‌) ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఇంకా పూర్తి స్పష్టత రావాల్సి ఉంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

4. 6 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత

వైకాపా నేతలు రాష్ట్రంలో సంక్షేమాన్ని రద్దు చేసి అభివృద్ధిని రివర్స్‌ చేశారని తెదేపా అధినేత చంద్రబాబు ఆరోపించారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లోనే వారిపై ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందన్నారు. ‘పేదలకు పండగ కానుకలు, అన్నక్యాంటీన్లు, చంద్రన్న బీమా, గిరిజనులకు ఫుడ్‌బాస్కెట్‌ను రద్దు చేశారు. రాజధానిపై అపోహలు సృష్టించడం, పెట్టుబడులు పోగొట్టడం, కులమత విద్వేషాలు పెంచడం, రైతు ఆత్మహత్యలు, చిరుద్యోగుల ఆత్మహత్యాయత్నాలు.. వీటన్నింటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. వైకాపా ఇసుక, మద్యం మాఫియాను ఎండగట్టాలి’ అని సూచించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

5. కొత్త బార్ల విధానం ఖరారు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతమున్న బార్ల లైసెన్సులన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుంది. వాటి స్థానంలో కొత్తవి ఏర్పాటు కోసం రెండేళ్ల కాలపరిమితితో (2020 జనవరి 1 నుంచి - 2021 డిసెంబరు 31 వరకూ) నూతన విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం ఇప్పుడున్న వాటిలో 40శాతం బార్లు కనుమరుగు కానున్నాయి. మిగతా వాటికి మాత్రమే కొత్తగా లైసెన్సులు కేటాయించనుంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

6. రైల్వేను ప్రైవేటీకరించడం లేదు: పీయూష్‌ 

భారతీయ రైల్వేను ప్రైవేటీకరించడం లేదని కేంద్ర రైల్వే మంత్రి పీయూష్‌ గోయెల్‌ తెలిపారు. ప్రయాణికులకు నాణ్యమైన సేవలు అందించడానికి కొన్ని రైళ్లలో వాణిజ్య, ఆన్‌బోర్డ్‌ సేవలను మాత్రమే ప్రైవేటుకి అప్పగిస్తున్నామని పేర్కొన్నారు. రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల భద్రత బాధ్యత రైల్వేదేనని శుక్రవారం రాజ్యసభలో కాంగ్రెస్‌ ఎంపీ కేవీపీ రామచంద్రరావు అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి సమాధానమిచ్చారు.

7. సింధు లోయలో ఇరాన్‌, అండమాన్‌ వాసుల జన్యుక్రమం

సింధు లోయలో ఒకప్పుడు ఇరాన్‌, అండమాన్‌ ప్రాంతాలకు చెందిన పూర్వీకులు నివాసం ఉండేవారని రాఖీగడి డీఎన్‌ఏ విశ్లేషణ చెబుతోంది. ఆర్యుల మూలాలు దీనిలో లేకపోవడం విశేషం. దీనివల్ల ఇది పలు సందేహాలను లేవనెత్తింది. దక్షిణ భారతదేశ వాసులకు, అండమాన్‌ వాసులకు ఉన్న జన్యు సంబంధాల పరిశోధకుల్లో ఒకరైన సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్‌ థంగరాజ్‌ ఈ అంశాలపై ‘‘ఈనాడు డిజిటల్‌’’కు వివరించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

8. ప్రయివేటుకు ‘ఆధార్‌’ ఇవ్వడం సరైనదేనా?

‘ఆధార్‌’ సమాచారాన్ని ప్రయివేటు సంస్థలు వినియోగించుకోవడాన్ని సవాలు చేస్తూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. దీనిపై సమాధానం చెప్పాలని శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినియోగదారులు స్వచ్ఛందంగా అంగీకరిస్తే గుర్తింపు పత్రంగా ఆధార్‌ను ఉపయోగించుకునేందుకు ప్రయివేటు సంస్థలకు అనుమతి ఇస్తూ కేంద్ర ప్రభుత్వం జులై నెలలో చట్టాన్ని సవరించింది. దీన్ని సవాల్‌ చేస్తూ పిటిషన్‌ దాఖలైంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి 

9. బ్యాంకులకు మరిన్ని కష్టాలు

భారత బ్యాంకులపై మరింత భారం పడనుంది. ఇప్పటికే రూ.9 లక్షల కోట్లకుపైగా మొండి బకాయిలతో సతమతమవుతున్న బ్యాంకులకు మరో రూపంలో ఇబ్బంది ఎదురుకానుంది. డీహెచ్‌ఎఫ్‌ఎల్‌కు చెందిన రూ.35,000 కోట్ల రుణాలను రద్దు చేయాల్సి వస్తే షాడో బ్యాంక్‌ సంక్షోభం మరింత ముదిరే అవకాశం లేకపోలేదు. మొత్తం వ్యవహారానికి కేపీఎమ్‌జీ నివేదిక కీలకంగా మారనుంది. దేవాన్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌ కార్ప్‌ను మోసపూరిత ఖాతాగా ప్రకటిస్తే.. సంక్షోభం మరింత క్షోభపెట్టవచ్చు. పూర్తి వార్త  కోసం క్లిక్‌ చేయండి 

10. పారా స్పోర్ట్స్‌లో నటీమణుల సందడి


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు
సినిమా

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.