close

తాజా వార్తలు

ముగ్గురు నాయికలతో 

ముగ్గురు నాయికలతో ముగ్గురు నాయికలతో 

‘బాహుబలి 2’ తరువాత ఎస్‌.ఎస్‌. రాజమౌళి సరైన చిత్రాన్నే ఎంచుకున్నారు. ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌ల కోసం ఓ మల్టీ స్టారర్‌ కథ సిద్ధం చేసి పరిశ్రమలో కొత్త ఉత్సాహాన్ని తీసుకొచ్చారు. సరికొత్త సంప్రదాయానికి తెర లేపారు. ఎన్టీఆర్‌, చరణ్‌లను ఒకే తెరపై చూడాలని వాళ్ల అభిమానులే కాదు, తెలుగు ప్రేక్షకులంతా ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు.  డి.వి.వి.దానయ్య  నిర్మాతగా వ్యవహరించే ఈ చిత్రం వచ్చే నెల 5న లాంఛనంగా మొదలవుతుంది. ఇందులో ముగ్గురు కథానాయికలుంటారని సమాచారం. అందులో ఓ కథానాయికగా విదేశీ భామని ఎంచుకుంటారని ప్రచారం జరుగుతోంది. ఈ ముగ్గురూ ఎవరన్నది త్వరలో ప్రకటిస్తారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్‌ సరికొత్తగా కనిపించబోతున్నారు. ప్రత్యేక నిపుణుడి ఆధ్వర్యంలో ఎన్టీఆర్‌ ఇప్పటికే కసరత్తులు మొదలెట్టేశారు. చరణ్‌ పాత్ర, ఆయన గెటప్‌ కూడా వైవిధ్యంగా కనిపించబోతోందని సమాచారం.      ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సెంథిల్‌ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తారు.

 


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.