close

తాజా వార్తలు

వరద బాధితులకు అమితాబ్‌ సాయం

ముంబయి: బాలీవుడ్‌ మెగాస్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. వరదలతో సతమతమౌతున్న బిహార్‌ ప్రజలకు తనవంతు సాయం అందించారు. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.51 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌కు లేఖ రాశారు. ‘ప్రకృతి వైపరీత్యం వల్ల రాష్ట్రం దెబ్బతినడం నన్ను చాలా బాధిస్తోంది. ఈ వరదల కారణంగా నష్టపోయిన బాధితులకు నా సానుభూతి తెలుపుతున్నా. నా వంతుగా సహాయం చేస్తున్నా’ అని బిగ్‌బి పేర్కొన్నారు.

గత కొన్ని రోజులుగా బిహార్‌ను వర్షాలు ముంచెత్తుతున్నాయి. ఈ కారణంగా పట్నా, కైమూర్, భాగల్పూర్‌తోపాటు తదితర ప్రాంతాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 15 జిల్లాల్లోని 1,400 గ్రామ ప్రజలు సమస్యలు ఎదుర్కొంటున్నారు. 73 మంది ప్రాణాలు కోల్పోగా, 20 లక్షల మంది వరదల ప్రభావం వల్ల నష్టపోయారు.


Tags :

సినిమా

రాజకీయం

జనరల్‌

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.