
తాజా వార్తలు
అడుగేసే ముందు.. అన్నీ చూసుకో!
ఇంజినీరింగ్ బ్రాంచా.. కళాశాలా?
ప్రవేశపరీక్షల ర్యాంకులు ప్రకటించేశారు. ఇప్పుడు ఇంజినీరింగ్ అభ్యర్థులకు కొత్త ప్రశ్న ప్రారంభమైంది. ఇష్టమైన బ్రాంచి తీసుకోవాలా... మంచి కాలేజీలో చేరాలా? చిక్కు సమస్యే. ఒక్కొక్కరూ ఒక్కోరకంగా చెబుతుంటారు. ఎటూ తేల్చుకోలేని సందిగ్ధత. ఇది ఏటా అందరికీ ఎదురయ్యే ఇబ్బందే. నిజానికి రెండూ ముఖ్యమే. కానీ మనకున్న అవకాశాలూ, మన ఇష్టానిష్టాలు, భవిష్యత్తు... ఇంకా ఇతర అంశాలను బేరీజు వేసుకొని అనుకూలమైన నిర్ణయం తీసుకోవాలి. విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులను ప్రధానంగా పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేసుకోవాలి.
ఇంటర్మీడియట్ తర్వాత ఇంజినీరింగ్‌లో చేరాలనుకునే అభ్యర్థులు, తల్లిదండ్రుల ముందు ఎన్ని రకాల ప్రశ్నలు... మంచి కళాశాలలో చేరాలా.. నచ్చిన బ్రాంచిని ఎంచుకోవాలా? ఏ కాలేజీ మంచిదో ఎలా తెలుస్తుంది? ఏ బ్రాంచి తీసుకోవాలి? ఇప్పుడు అవకాశాలు బాగా ఉన్న బ్రాంచిలకి తర్వాత భవిష్యత్తు బాగుంటుందా? ఫలానా బ్రాంచి తీసుకుంటే చదవగలుగుతారా? ఈ సందేహాలతోపాటు ఏ ర్యాంకుకి ఏ కాలేజీలో సీటు వస్తుంది? అయ్యో.. ఆ బ్రాంచి రావాలంటే ఇంకా మంచి ర్యాంకు కావాలి కదా? కాలేజీ ముఖ్యం అనుకుంటే కావాల్సిన బ్రాంచి అందడం లేదు. బ్రాంచి ప్రధానం అని భావిస్తే కాలేజీ సరిగా ఉండటం లేదు. ఏం చేయాలి? ఏమీ పాలుపోవడం లేదు. టాప్ ర్యాంకర్లు మినహా మిగతా అభ్యర్థులందరూ దాదాపు ఇవే ప్రశ్నలతో సతమతమవుతుంటారు. ఇంత గందరగోళానికి గురికావాల్సిన పనిలేదు. మనకి ఏం కావాలో తేల్చుకోడానికి కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి. వాటి ఆధారంగా తగిన నిర్ణయం తీసుకోవచ్చు.
ఏ విషయం గురించి తేల్చుకోవాలన్నా.. అన్నీ వ్యక్తిగతంగా తెలుసుకోవాలి. సీనియర్లతో మాట్లాడాలి. కాలేజీలకు సంబంధించి తెలిసిన అన్ని వివరాలను పరిశీలించాలి. ప్రాంగణాలను సందర్శించాలి. మౌలికవసతులను గమనించాలి.
బ్రాంచీ ముఖ్యమని భావిస్తే..! ఎంత ఆలోచించినా ఏ బ్రాంచి తీసుకోవాలి అనేది ఎంతకీ తెగని సమస్యగా కనిపిస్తుంది. కానీ కొన్ని వివరాలను సేకరించుకోవడం ద్వారా ఒక మంచి నిర్ణయానికి రావచ్చు. మొదట అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే మంచి బ్రాంచి, చెడ్డ బ్రాంచి అని ఏదీ లేదు. దేని ప్రత్యేకత దానిదే. విద్యార్థుల అభిరుచులు, ఆసక్తులు, భవిష్యత్తులో తాము ఏం చేయాలనుకుంటున్నారనే అంశాల ఆధారంగా మాత్రమే నిర్ణయం తీసుకోవాలి. ఇంజినీరింగ్‌లో వందల సంఖ్యలో స్పెషలైజేషన్లు ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సివిల్, మెకానికల్, ఆటోమొబైల్ వంటి మౌలికమైన బ్రాంచిలు దాదాపు అన్ని కళాశాలల్లో ఉన్నాయి. కొన్ని కాలేజీలు, ప్రైవేటు యూనివర్సిటీలు కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి. అన్నింటినీ పరిశీలించాలి.
|
అధ్యాపకులు, వసతులకు ప్రాధాన్యం
- ప్రొఫెసర్ ఎం. కుమార్, ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, ఉస్మానియా యూనివర్సిటీ.
|
అన్ని బ్రాంచీలు మంచివే
- ప్రొఫెసర్ పి. శ్రీనివాసరావు, ప్రిన్సిపల్, యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, ఆంధ్రాయూనివర్సిటీ
|
మరికొన్ని అంశాలు కాలేజీ, బ్రాంచిల్లో ఏది ముఖ్యమని నిపుణులను ప్రశ్నిస్తే రెండూ అనే సమాధానమే ఎక్కువగా వస్తోంది. కాస్త వివరంగా విచారిస్తే కొద్దిగా కాలేజీ వైపు మొగ్గు చూపుతున్నారు. మంచి వసతులు ఉన్న కాలేజీ అయితే ఏ బ్రాంచి అయినా ఫర్వాలేదని చెబుతున్నారు. విద్యార్థులు, తల్లిదండ్రులు ఫలానా బ్రాంచినే కావాలని పట్టుబట్టడం సమంజసం కాదంటున్నారు. సాఫ్ట్వేర్ ఒక్కటే కాకుండా కోర్ బ్రాంచిలైన సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ తదితరాలకు సంబంధించి క్యాంపస్ రిక్రూట్మెంట్లు జరిగే కాలేజీలను ఎంచుకోవడం మంచిదంటున్నారు. |
కాలేజీ ప్రధానం అనుకుంటే! 2 తర్వాత చూడాల్సింది కరిక్యులమ్ (బోధనా ప్రణాళిక), సిలబస్. దీన్ని విశ్వవిద్యాలయాలు నిర్దేశిస్తాయి. అటానమస్ కాలేజీలు, డీమ్డ్ యూనివర్సిటీలు కరిక్యులమ్, సిలబస్‌లను స్వయంగా నిర్ణయించుకుంటాయి. అయితే ఈ రెండూ భవిష్యత్తు అవసరాలకు ఎంతవరకు దీటుగా ఉన్నాయో పరిశీలించుకోవాలి. అప్డేట్ కాని సిలబస్‌ల వల్ల విద్యార్థులు నష్టపోయే అవకాశం ఉంది. 3 కాలేజీ చెక్ చేశారు. సిలబస్ ఓకే. ఇప్పుడు ఆ పాఠ్యప్రణాళికను సమర్థంగా అమలు చేయడానికి తగిన అధ్యాపకులు ఉన్నారో లేదో తెలుసుకోవాలి. తగిన విద్యార్హతలు, అనుభవం ఉన్న లెక్చరర్లు ఉన్నారా? వారికి పరిశ్రమలతో పరిచయం లేదా పనిచేసిన అనుభవం ఉందా? పరిశోధన పేపర్లను ప్రచురించారా? ఇంజినీరింగ్ సంబంధిత పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చి ఉన్నారా? ఇవన్నీ ఉంటే మంచి అధ్యాపక బృందం ఉన్నట్లే. కనీసం తీసుకునే బ్రాంచికి సంబంధించి అయినా ఈ వివరాలను పరిశీలించుకోవాలి. 4 అధ్యాపకుల అర్హతలు, అనుభవాలతోపాటు తగినంత మంది సిబ్బంది ఆ కాలేజీలో ఉన్నారో లేదో చూసుకోవాలి. ఏఐసీటీఈ తాజా నిబంధనల ప్రకారం స్టూడెంట్, ఫ్యాకల్టీ రేషియో 1:20. ఇంకా ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్ల నిష్పత్తినీ పరిశీలించాలి. 5 అధ్యాపకుల తర్వాత ముఖ్యమైనది కాలేజీలోని మౌలిక వసతులు. లైబ్రరీ, ప్రయోగశాలలు సరిగా ఉన్నాయో లేదో చూడాలి. కొత్త కొత్త ఆవిష్కరణలకు తగిన ప్రోత్సాహం ఇస్తున్నారా, సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో శిక్షణ ఉందా? ఉంటే ఎలా ఉంది తదితర వివరాలను సేకరించుకోవాలి. 6 ఇంజినీరింగ్ అంటే కేవలం డిగ్రీ కాదు. ఇతర జీవన నైపుణ్యాలను నేర్చుకునే వేదిక కూడా. విద్యార్థి రోజులో ఎక్కువ భాగం ఇక్కడే గడుపుతారు. అందుకు అనువైన వాతావరణ పరిస్థితులను పరిశీలించాలి. క్రమశిక్షణ, తగినంత స్వేచ్ఛ కాలేజీలో ఇస్తున్నారో లేదో చూడాలి. ఈ సమాచారం సీనియర్ విద్యార్థులను అడగటం ద్వారా తెలుసుకోవచ్చు. ప్రాజెక్టులు, ప్రయోగాల వివరాలను తెలుసుకోవాలి. సహవిద్యార్థులతో సంప్రదింపులకు వీలు, ఆటలకు ప్రోత్సాహం ఎలా ఉన్నాయో చూడాలి. వీలైతే క్రీడా మైదానాలను సందర్శించాలి. 7 కాలేజీ ప్రతిష్ఠ కూడా విద్యార్థులకు ఉపయోగపడుతుంది. ఫలానా కళాశాల విద్యార్థి అనగానే ఒక అభిప్రాయం ఎదుటివారిలో ఏర్పడుతుంది. స్థాపన నుంచి అభివృద్ధి చెందిన విధానం కాలేజీకి ప్రజల్లో ఒక పేరును తెస్తుంది. క్రమశిక్షణను, విలువలను పాటించే కళాశాలల విద్యార్థులకు ఉద్యోగాల ఎంపికలో ప్రాధాన్యం ఉంటుంది. 8 కాలేజీ వివరాల సేకరణ అనేక రకాలుగా చేయవచ్చు. వాటిలో కరపత్రాలు, ప్రకటనలు కూడా ఉన్నాయి. కేవలం వాటినే ఆధారం చేసుకొని అడ్మిషన్లు తీసుకోకూడదు. అలా అని పూర్తిగా విస్మరించకూడదు. ప్రకటనల్లో, కరపత్రాల్లో ఆయా కళాశాలల యాజమాన్యాలు ఇచ్చిన సమాచారాన్ని స్వయంగా పరిశీలించి తెలుసుకోవాలి. పిల్లల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించేందుకు ఏయే ప్రోగ్రామ్‌లను చేపడుతున్నారో అడగాలి. |
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
జాతీయ-అంతర్జాతీయ
చిత్ర వార్తలు
సినిమా
- ఆప్త నేస్తాలు.. ఆఖరి మజిలీ!
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- క్షమించు నాన్నా..నిను వదిలి వెళ్తున్నా!
- రోహిత్‌ను సరదాగా ట్రోల్ చేసిన డీకే
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- కంగారూను పట్టలేక..
- రెరా మధ్యే మార్గం
- సికింద్రాబాద్‌లో భారీగా బంగారం చోరీ
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
ఎక్కువ మంది చదివినవి (Most Read)
