Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 112923
            [news_title_telugu_html] => 

రోహిత్‌ శతకం..

[news_title_telugu] => రోహిత్‌ శతకం.. [news_title_english] => hundred off just 85 balls [news_short_description] => పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ చెలరేగిపోతున్నాడు. ఆరంభం నుంచి పాక్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్‌ 30 ఓవర్‌లో శతకం అందుకున్నాడు [news_tags_keywords] => rohit,ind vs pak,icc world cup 2019 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => | [news_videoinfo] => | [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-06-16 17:28:45 [news_isactive] => 1 [news_status] => 2 ) )
రోహిత్‌ శతకం.. - hundred off just 85 balls - EENADU
close

తాజా వార్తలు

రోహిత్‌ శతకం..

మాంచెస్టర్‌: పాకిస్థాన్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ చెలరేగిపోతున్నాడు. ఆరంభం నుంచి పాక్‌ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ భారీ షాట్లతో అలరిస్తున్నాడు. ఈ క్రమంలో ఇన్నింగ్‌ 30 ఓవర్‌లో శతకం అందుకున్నాడు. పాక్‌ బౌలర్‌ షెహదాబ్‌ ఖాన్‌ వేసిన 30 ఓవర్‌ ఆఖరి బంతికి సింగిల్‌ రాబట్టిన రోహిత్‌(100నాటౌట్‌; 85బంతుల్లో 10×4, 3×6) సెంచరీ పూర్తి చేశాడు. రోహిత్‌ కేవలం 85 బంతుల్లోనే శతకాన్ని అందుకోవడం మరో విశేషం. ఇదిలా ఉండగా ఈ ప్రపంచకప్‌లో రోహిత్‌కిది రెండో శతకం. టోర్నీ ఆరంభంలో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో హిట్‌మ్యాన్‌ తొలి శతకం అందుకున్నాడు. తర్వాత ఆస్ట్రేలియాతో జరిగిన రెండో మ్యాచ్‌లోనూ చక్కగా రాణించి అర్ధశతకం చేశాడు. 

తాజా శతకంతో వన్డేల్లో రోహిత్‌ చేసిన శతకాల సంఖ్య 24కు చేరుకుంది. అది కూడా 203 ఇన్నింగ్‌లలోనే అందుకోవడం మరో విశేషం. దీంతో అతి తక్కువ ఇన్నింగ్‌లలో 24 శతకాలు అందుకున్న నాలుగో బ్యాట్స్‌మెన్‌గా రోహిత్‌ నిలిచాడు. హాషీమ్‌ ఆమ్లా(142 ఇన్నింగ్‌లు), విరాట్‌ కోహ్లీ(161 ఇన్నింగ్‌లు), ఏబీ డివిలియర్స్‌(192 ఇన్నింగ్‌లు).. అతని కంటే ముందు వరుసలో ఉన్నారు. 
 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.