close

తాజా వార్తలు

పడవ బోల్తాపడి ఆరుగురి మృతి 

పడవ బోల్తాపడి ఆరుగురి మృతి 

ముంబయి: మహారాష్ట్రలోని నందూర్బార్‌ జిల్లాలో నర్మదానదిలో ఓ పడవ బోల్తాపడటంతో ఆరుగురు మృతి చెందారు. అందులో ప్రయాణిస్తున్న మరో 36 మందిని స్థానికులు రక్షించి, దగ్గరలోని ఆస్పత్రులకు తరలించారు. మకర సంక్రాంతి సందర్భంగా తమ ఆచారం ప్రకారం పూజల్లో పాల్గొనేందుకుగానూ ఆ పడవలో దాదాపు 60 మంది ప్రయాణికులు వెళుతుండగా ఈ ఘటన చోటు చేసుకుందని ఓ అధికారి తెలిపారు. సహాయక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయని చెప్పారు. ఈ ఘటనలో మృతులందరూ ఉత్తర మహారాష్ట్రలోని ఓ గ్రామానికి చెందిన వారని పోలీసులు తెలిపారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని వారు చెప్పారు. సామర్థ్యానికి మించి ఆ పడవలో ప్రయాణికులు ఎక్కినందుకే ఈ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. పడవ ఒడ్డుకు చేరుకుంటున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంపై మరింత సమాచారం అందాల్సి ఉంది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.