close

తాజా వార్తలు

జనాభా పెరిగితే నియోజకవర్గాలు పెరుగుతాయా?

చిన్నూ: అసలు ఈ నియోజకవర్గాలు ఎలా ఏర్పాటు చేస్తారు తాతయ్యా?
ఆర్వీరామారావ్‌ తాతయ్య: జనాభా సంఖ్యను బట్టి నియోజక వర్గాలు ఏర్పాటు చేస్తారు. పార్లమెంటు నియోజక వర్గాలు, శాసనసభ నియోజకవర్గాలు కూడా ఇలాగే ఏర్పాటు చేస్తారు.

చిన్నూ: జనాభా పెరిగితే నియోజక వర్గాలు పెరుగుతాయా?
తాతయ్య: పెరుగుతాయి. కానీ పార్లమెంటు, శాసనసభ నియోజకవర్గాలు ఎప్పుడంటే అప్పుడు పెరగవు. మన దేశంలో పదేళ్లకోసారి జరిగే జనాభా లెక్కల ఆధారంగా ఇవి ఏర్పడతాయి. దీన్నే నియోజకవర్గాల పునర్విభజన అంటారు. దీనికి రాష్ట్రపతి అనుమతి కావాలి.

చిన్నూ: రాష్ట్రపతి అనుమతించకపోతే?
తాతయ్య: అలా ఉండదు. మన రాష్ట్రపతి కేంద్ర మంత్రివర్గ సలహా ప్రకారం నడుచుకుంటారు. ప్రతి జనాభా లెక్కల తర్వాత నియోజకవర్గ పునర్విభజనకు చట్టం చేసే అవకాశాన్ని రాజ్యాంగంలోని 82వ అధికరణం పార్లమెంటుకు ఇస్తోంది. ఈ చట్టం ఆమోదించిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నియోజకవర్గాల పునర్విభజనకు ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తుంది.

చిన్నూ: అంటే జనాభా పెరుగుతుంటే నియోజకవర్గాలు పెరుగుతాయన్నమాట. అంతేనా?
తాతయ్య: అలా కాదు. లోక్‌సభ నియోజకవర్గాలకు పరిమితి ఉంటుంది. రాజ్యాంగం లోక్‌సభలో గరిష్ఠంగా 552 స్థానాలు ఉండటానికి అనుమతిస్తుంది. కానీ చాలాకాలంగా నియోజకవర్గాల పునర్విభజన జరగనందువల్ల ఇప్పుడు 543 స్థానాలే ఉన్నాయి.

చిన్నూ: లోక్‌సభ స్థానాలు మారుతూ ఉన్నాయా?
తాతయ్య: అవును. మొదటి లోక్‌సభలో 489,  2వ లోక్‌సభలో 494, 3వ లోక్‌సభలో 505, నాల్గవ  లోక్‌సభలో 520, 6వ లోక్‌సభలో 542 సీట్లు ఉండేవి. ఇప్పుడు మొత్తం 543 స్థానాలున్నాయి.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.