close

తాజా వార్తలు

అదృష్టం అంటే వీళ్లదే మరీ..!

వాకింగ్‌కు వెళ్లారు.. బంగారంతో తిరిగొచ్చారు..

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆస్ట్రేలియాలోని ఒక కుటుంబం వాకింగ్‌కు వెళితే వారిని అదృష్టం వరించింది. అది అలాంటి ఇలాంటి అదృష్టం కాదు.. ఏకంగా వారిని ఆర్థిక కష్టాల నుంచి బయటపడేసే బంగారం లాంటి అదృష్టం. ఇక వివరాల్లోకి వెళ్తే.. ఒక వ్యక్తి తన ఇద్దరు కూతుళ్లతో సహా పెంపుడు కుక్కను వెంటబెట్టుకుని ఉదయాన్నే వాకింగ్‌కు బయలు దేరాడు. ఎప్పటిలాగే  సాధారణంగా వారు నడుస్తుండగా ఆయన కుమార్తెకు ఒక రాయి కనిపించింది. ఆ రాయి మెరుస్తూ ఉండడంతో అది బంగారమేమోనని అనుమానం వచ్చిన ఆమె తండ్రిని అడిగింది. తండ్రికి కూడా అనుమానం రావడంతో దాన్ని పరిశీలించి అది బంగారమేనని నిర్ధారణకు వచ్చాడు. ఆ తర్వాత దాని బరువు తెలుసుకోడానికి ఒక సూపర్‌ మార్కెట్‌కు వెళ్లి ప్రయత్నించగా అది 1.25 పౌండ్లు ఉన్నట్లు తెలిసింది. దాదాపు విలువ 24వేల డాలర్లపైగా ఉంటుందని అంచనా వేశారు. దీంతో అతడు అదృష్టం కలసి వచ్చిందని భావించాడు. ఆర్థికంగా కష్టాల్లో ఉన్న సమయంలో తనకు ఈ బంగారు ముద్ద దొరకడం నిజంగా తన అదృష్టమే అని మీడియా ముందు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ఆస్ట్రేలియాలో సంవత్సర కాలంలో ఇలాంటి బంగారు రాయి బయట పడడం ఇది రెండోసారి. గత సెప్టెంబర్‌లో కూడా గోల్డ్‌ఫీల్డ్‌ ప్రాంతంలో ఒక వ్యక్తికి 7 పౌండ్ల బరువున్న బంగారు ముద్ద దొరకడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.