close

తాజా వార్తలు

అమేఠీలో రాహుల్‌కి వ్యతిరేకంగా పోస్టర్ల కలకలం‌

అమేఠీ (ఉత్తర్‌ప్రదేశ్‌): కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ బుధవారం అమేఠీలో పర్యటిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ఆ నియోజక వర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. భాజపా నాయకురాలు, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం తొలిసారి ఆయన ఈ ప్రాంతానికి వచ్చారు. తన పర్యటనలో భాగంగా తమ కార్యకర్తలతో సమావేశం అయ్యారు. అనంతరం ఆయన శివ మహేశ్‌ కళాశాలలో నిర్వహించనున్న ఓ కార్యక్రమంలో పాల్గొంటారు. అయితే, ఆయన పర్యటన సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ స్థానిక కార్యాలయం వద్ద కొందరు పెట్టిన పోస్టర్లు కలకలం రేపాయి.

ఆ ప్రాంతంలో సంజయ్‌ గాంధీ మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఓ ఆస్పత్రి ఉంటుంది. ఇందులో చికిత్స కోసం చేరిన ఓ వ్యక్తి మృతి చెందాడని, దీనికి రాహుల్‌ గాంధీదే బాధ్యత అంటూ ఆ పోస్టర్లలో రాసుకొచ్చారు. ‘‘నా కుటుంబానికి న్యాయం కావాలి. సంజయ్‌ గాంధీ ఆస్పత్రి.. రోగుల జీవితాలను కాపాడట్లేదు.. వారి ప్రాణాలను తీస్తోంది’’ అని అందులో ఓ వ్యక్తి చెబుతున్నట్లుగా రాసుకొచ్చారు. ఆ ట్రస్టుకి బాధ్యుడు రాహులే కాబట్టి ఆయనే సమాధానం చెప్పాలని ఆ పోస్టర్‌లో డిమాండ్‌ చేశారు. అయితే, ఈ పోస్టర్లు ఎవరు ఏర్పాటు చేశారన్న విషయం మాత్రం తెలియరాలేదు. 1999 నుంచి అమేఠీ ఎంపీగా ఉన్న రాహుల్‌ 2019 ఎన్నికల్లో ఓడారు. 

ఈ పోస్టర్లపై ఆ జిల్లా కాంగ్రెస్‌ నేత అనిల్‌ సింగ్‌ మాట్లాడుతూ... భాజపా కుట్రలో భాగంగానే ఈ పోస్టర్లను అంటించారని ఆరోపించారు. ‘‘ఇప్పుడు ఈ నియోజక వర్గానికి స్మృతి ఇరానీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భాజపాయే కుట్రపూరితంగా ఈ పని చేసింది. ఇంతకు ముందు కూడా భాజపా ఇటువంటి పనులకు పాల్పడింది’’ అని వ్యాఖ్యానించారు.    


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.