Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146194
            [news_title_telugu_html] => 

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

[news_title_telugu] => టాప్‌ 10 న్యూస్ @ 5 PM [news_title_english] => FIVE PM NEWS [news_short_description] => [news_tags_keywords] => TOP NEWS, 5 PM [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-22 17:00:00 [news_isactive] => 1 [news_status] => 2 ) )
టాప్‌ 10 న్యూస్ @ 5 PM - FIVE PM NEWS - EENADU
close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 5 PM

1. చిదంబరంను కోర్టులో ప్రవేశపెట్టిన సీబీఐ

ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో అరెస్టయిన కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరాన్ని సీబీఐ అధికారులు దిల్లీలోని రౌస్‌ అవెన్యూలో ఉన్న సీబీఐ ప్రత్యేక కోర్టుకు తీసుకొచ్చారు. పటిష్ట భద్రత నడుమ ఆయన్ను తీసుకెళ్లి కోర్టులో ప్రవేశపెట్టారు. చిదంబరం రిమాండ్‌ ప్రతిని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా న్యాయమూర్తికి అందజేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

2. తెరాసలో 60లక్షల సభ్యత్వాలు: కేటీఆర్‌

తెరాస 60 లక్షల సభ్యత్వాలను పూర్తి చేసుకొన్నట్లు ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ తెలిపారు. ఆయన నేడు పార్టీ నాయకులతో సభ్యత నమోదుపై సమీక్ష నిర్వహించారు. నేటితో సభ్యత్వ నమోదు ముగిసిందని వెల్లడించారు. రాష్ట్రంలో తెరాసను మించిన బలమైన పార్టీ లేదన్నారు. భారీగా సభ్యత్వాల నమోదుకు కృషి చేసినందుకు పార్టీ నేతలను అభినందించారు. ఈ కార్యక్రమంలో గజ్వేలు, వర్థన్నపేటలు ముందు వరుసలో నిలిచాయన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

3. ఏపీ ప్రభుత్వం ఇప్పుడేం చెబుతుంది: చంద్రబాబు

పోలవరం జలవిద్యుత్తు ప్రాజెక్టు ఒప్పందం రద్దు విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఏపీ ప్రతిపక్షనేత చంద్రబాబు స్పందించారు. తాజా తీర్పుపై ప్రభుత్వం ఏం చెబుతుందని ఆయన ప్రశ్నించారు. ఇది ఇక్కడితో ఆగదని.. ఈ జాప్యం ప్రాజెక్టుపై మరింత ప్రభావం చూపుతుందని అన్నారు. అమరావతిలో ఆయన మీడియాతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. పోలవరంపై ప్రయోగాలు వద్దని ఎవరెన్ని చెప్పినా వినకుండా ప్రభుత్వం మూర్ఖంగా వెళ్లిందని ఆరోపించారు. లేని అవినీతిని నిరూపించాలని చూశారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

4. చంద్రయాన్‌-3కి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం

భారత్‌ ప్రయోగించిన మొదటి మూన్‌ ల్యాండింగ్ మిషన్‌ను ప్రపంచం మొత్తం చాలా ఆసక్తిగా గమనిస్తోందని ఇస్రో ఛైర్మన్ కె.శివన్‌ వెల్లడించారు. ఇది అంతర్జాతీయ స్థాయిలో అత్యంత ప్రముఖమైన మిషన్‌ అని మీడియాతో మాట్లాడుతూ పేర్కొన్నారు. చంద్రుడి మీదకు దిగే ల్యాండర్‌ విక్రమ్‌ ల్యాండింగ్ ప్రక్రియ సెప్టెంబరు ఉదయం 1.40కి ప్రారంభమై, దక్షిణ ధ్రువం మీదకు ఉదయం 1.55కు దిగుతుందని వెల్లడించారు. అలాగే చంద్రయాన్‌-3కి కూడా ఇస్రో ప్రణాళికలు సిద్ధం చేస్తుందని తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

5. చిదంబరానికి 20 ప్రశ్నలు వేసిన సీబీఐ

కాంగ్రెస్ సీనియర్‌ నేత, కేంద్ర మాజీ మంత్రి పి. చిదంబరం ముందు సీబీఐ 20 ప్రశ్నలు ఉంచింది. ఐఎన్‌ఎక్స్‌ మీడియా కేసులో సీబీఐ ఆయన్ను నిన్న రాత్రి 12గంటల సమయంలో ఆయనను విచారించడం ప్రారంభించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాత్రంతా ఆయన నిద్ర లేకుండా గడిపినట్లు వెల్లడించాయి. గురువారం ఉదయం కూడా మరో దఫా ప్రశ్నించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

6. రాజధానిపై తలో మాట: గల్లా

కృష్ణానది వరదపై ప్రభుత్వం సరిగా అంచనా వేయలేదని ఫలితంగా వరద ఉద్ధృతికి 6 వేల ఎకరాలు నీట మునిగాయని తెదేపా ఎంపీ గల్లాజయదేవ్‌ అన్నారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ సీనియర్‌ నేతలు కేశినేని నాని, దేవినేని ఉమామహేశ్వరరావుతో కలిసి ఆయన మాట్లాడారు. పంటనష్టపోయి 10 వేల మంది కుటుంబాలు ఇబ్బంది పడ్డాయని అన్నారు. అమరావతి రాజధానిపై మంత్రులు తలోరకంగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

7. చంద్రబాబు తప్పులే జగన్‌ చేస్తున్నారు: కన్నా

తెదేపా అధినేత చంద్రబాబు గతంలో సీఎంగా ఉన్నప్పుడు చేసిన తప్పుల్నే ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ఆరోపించారు. ప్రాజెక్టుల విషయంలో ఏకపక్షంగా వెళ్లొద్దని మొదట్నుంచీ చెబుతున్నామని, న్యాయపరమైన చిక్కులు ఎదురవుతాయని చెప్పినా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోలేదని వ్యాఖ్యానించారు. వారు చేసిన తప్పును ధైర్యంగా చెప్పలేక.. కేంద్రంపై నెట్టడం సరికాదని హితవు పలికారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

8. మరో సంచలన నిర్ణయం దిశగా ట్రంప్‌

సంచలన నిర్ణయాలు తీసుకోవడంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఎప్పుడూ ముందుంటారు. ‘అమెరికా ఉద్యోగాలు అమెరికన్‌లకే’ నినాదంతో వలసదారుల పట్ల కఠిన నిర్ణయాలను అమలు చేసిన ట్రంప్‌ సర్కారు మరో సంచలన నిర్ణయం తీసుకునే దిశగా కదులుతోంది. జన్మతః పౌరసత్వం (బర్త్‌రైట్‌ సిటిజన్‌ షిప్‌) రద్దు చేసే విషయం గురించి తాము తీవ్రంగా ఆలోచిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వెల్లడించారు. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

9. కియా సెల్టోస్‌ మార్కెట్లోకి వచ్చేసిందోచ్..!

ఎంతోకాలంగా ఎదురు చూస్తున్న కియా సిల్టోస్‌ కాంపాక్ట్‌ ఎస్‌యూవీ మార్కెట్లోకి వచ్చేసింది. దీని ధర రూ.9.69 లక్షల నుంచి అత్యధికంగా 15.99 లక్షల వరకు ఉంది. ఈ కారును తొలిసారి 2018 ఆటోషోలో ప్రదర్శించారు. భారత్‌లో ఈ కంపెనీ 2 బిలియన్‌ డాలర్లను పెట్టుబడిగా పెట్టింది. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం ప్లాంట్‌లో దీనిని తయారు చేస్తున్నారు. ఇక్కడి తయారైన కార్లు విదేశాలకు ఎగుమతి కానున్నాయి. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

10. బ్యాంకింగ్‌ షేర్ల అమ్మకాల ఒత్తిడితో..

బ్యాంకింగ్‌, ఎనర్జీ షేర్ల అమ్మకాల ఒత్తిడి ఒకవైపు, బలహీన అంతర్జాతీయ సంకేతాలు మరోవైపు వెరసి దేశీయ మార్కెట్లను భారీ నష్టాల్లోకి నెట్టేశాయి. గురువారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 587 పాయింట్లు నష్టపోయి 36,472.93 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 177 పాయింట్ల నష్టంతో 11వేల మైలురాయిని దిగిపోయి 10,908 వద్ద స్థిరపడింది. పూర్తి వార్త కోసం క్లిక్ చేయండి

 


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.