close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్‌ @ 5 PM

1. పీఎఫ్ వడ్డీ రేటు 8.65% ఇస్తాం : గంగ్వార్‌

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్(ఈపీఎఫ్‌) చందాదారులు 2018-19 సంవత్సరానికి గాను ప్రస్తుతమున్న 8.55 శాతం వడ్డీకి బదులు 8.65 శాతాన్ని పొందనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్‌ గంగ్వార్‌ తెలిపారు. ఆరు కోట్లకు పైగా చందాదారులకు మేలు కలిగించేలా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. దిల్లీలో ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ గంగ్వార్‌ ఈ విషయం తెలిపారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీ పంచాయతీరాజ్‌శాఖలో పనుల నిలిపివేత

 ఏపీ పంచాయతీరాజ్‌ శాఖలో పెద్ద మొత్తంలో రహదారి పనులను నిలిపివేశారు. ఈ మేరకు రూ.1031.17 కోట్ల విలువైన పనులను నిలిపివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 3,543 పనులను నిలిపివేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. పంచాయతీరాజ్‌, ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక కింద అనుమతి పొందిన పనులను నిలిపివేసినట్లు సమాచారం. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. గోదావరి ఘటనలో 26 మృతదేహాలు లభ్యం

గోదావరి బోటు ప్రమాదంలో వరుసగా మూడో రోజు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఇవాళ ఇప్పటి వరకు 18 మృతదేహాలు లభ్యమయ్యాయి. మొత్తంగా 26 మృతదేహాలు బయటపడ్డాయి. మూడో రోజు వివిధ ప్రదేశాల్లో ఒక్కొక్కటిగా కొట్టుకొస్తున్నాయి. బోటు మునిగిన ప్రాంతంలోనే ఎక్కువగా తేలుతున్నాయి. ఇవాళ కేవలం దేవీపట్నం వద్దే 12 మంది మృతులను గుర్తించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. ఇప్పుడేమీ మాట్లాడలేను: కోడెల శివరామ్‌

కోడెల శివప్రసాదరావు కుమారుడు శివరామ్‌ విదేశాల నుంచి వచ్చారు. కెన్యా నుంచి ఈ ఉదయం ముంబయి చేరుకున్న ఆయన.. కొద్దిసేపటి క్రితం గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. హైదరాబాద్‌ నుంచి గుంటూరు వస్తున్న కోడెల పార్థివదేహం వద్దకు శివరామ్‌ బయల్దేరారు. తమ కుటుంబం తీవ్ర ఆవేదనలో ఉందని.. ఈ పరిస్థితుల్లో తానేమీ మాట్లాడలేనని ఆయన చెప్పారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. ఎన్‌జీవోలకు కొత్త నిబంధనలు

ప్రభుత్వం ఫారెన్‌ కంట్రిబ్యూషన్‌ రెగ్యూలేటరీ చట్టం(ఎఫ్‌సీఆర్‌ఏ) నిబంధనలను సవరించింది. కొత్త నిబంధనల ప్రకారం రూ.లక్ష వరకు వచ్చే బహుమతులపై వివరాలను ప్రభుత్వానికి వెల్లడించాల్సిన అవసరం లేదు. గతంలో ఈ మొత్తం రూ.25వేలు ఉండేది. అంటే విదేశాల నుంచి వచ్చే బహుమతి మార్కెట్‌ విలువ రూ.25 వేల కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వానికి వెల్లడించాలి. ఇప్పుడు అది రూ.లక్షకు చేరింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. సచివాలయ ఉద్యోగాలు.. కమిటీల ఏర్పాటు

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల కోసం జిల్లా, ప్రాంతీయ స్థాయి కమిటీలకు మార్గదర్శకాలు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా స్థాయి కమిటీలో జిల్లా కలెక్టర్ చైర్మన్‌గా, జాయింట్ కలెక్టర్ ఉపాధ్యక్షులుగా కమిటీ ఏర్పాటు చేసిన ప్రభుత్వం.. జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కమిషనర్ కన్వీనర్‌గా, ఇతర ప్రాంతాల్లోని మున్సిపల్‌ కమిషనర్లను సభ్యులుగా నియమించింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ప్రజల్ని రెచ్చగొడుతున్నారు: శ్రీకాంత్‌రెడ్డి

వైకాపా వేధింపుల వల్లే తెదేపా సీనియర్‌నేత, మాజీ స్పీకర్‌ కోడెల చనిపోయారన్న తెదేపా నేతల ఆరోపణలపై ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి స్పందించారు. రాష్ట్రంలో వేధింపులు, రాజకీయ హత్యలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని విమర్శించారు. పోలీసు వ్యవస్థను సొంత జేబు సంస్థగా మార్చుకుంది తెదేపా కాదా? అని శ్రీకాంత్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రజలను రెచ్చగొట్టి శాంతిభద్రతలకు విఘాతం కలిగించాలని చూస్తున్నారని, చంద్రబాబు ప్రవర్తనను అంతా గమనిస్తున్నారన్నారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. ఎన్‌ఎస్‌జీ భద్రత వద్దన్న అమిత్ షా!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎస్‌జీ) కమాండోల ద్వారా ఇచ్చే భద్రతను తిరస్కరించారట. తనకు ఎన్‌ఎస్‌జీ భద్రత వద్దని, ప్రస్తుతం ఉన్న సీఆర్పీఎఫ్‌ భద్రతనే కొనసాగించాలని అమిత్ షా కోరినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

9. ఫిక్సింగ్‌ అంతానికి బెట్టింగ్‌ చట్టబద్ధం చేయాలి

మ్యాచ్‌ ఫిక్సింగ్‌ చట్టాన్ని సవరించి బెట్టింగ్‌ను న్యాయబద్ధం చేస్తే భారత క్రికెట్‌లో అవినీతిని అరికట్టొచ్చని బీసీసీఐ అవినీతి నిరోధ విభాగం చీఫ్‌ అజిత్‌ సింగ్‌ షెకావత్‌ అన్నారు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఉదంతాలు బయటపడిన నేపథ్యంలో ఆయన పీటీఐకి ముఖాముఖి ఇచ్చారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘చమురు వేడి’లో మార్కెట్లు విలవిల

ఓవైపు జీడీపీ వృద్ధిరేటు నెమ్మదించడం.. మరోవైపు చమురు ధరలు పెరగడం.. దీనికి తోడు ఆటోరంగం డీలా పడటం.. వెరసి దేశీయ మార్కెట్లు మంగళవారం భారీగా పతనమయ్యాయి. నేటి సెషన్లో సెన్సెక్స్‌ ఏకంగా 642 పాయింట్లు దిగజారి 36,481 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ 186 పాయింట్ల నష్టంతో 10,818 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 71.86గా కొనసాగుతోంది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.