close

తాజా వార్తలు

టాప్‌ 10 న్యూస్ @ 9 PM

1. హుజూర్‌నగర్‌లో కేసీఆర్‌ వరాల వర్షం

హుజూర్‌నగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వరాల వర్షం కురిపించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయిస్తామని ప్రకటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌ నియోజకవర్గంలో జరిగిన ఉపఎన్నికలో శానంపూడి సైదిరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపేందుకు తెలంగాణ రాష్ట్రసమితి శనివారం భారీ బహిరంగ సభ నిర్వహించింది. హుజూర్‌నగర్‌లో ఏర్పాటు చేసిన సభకు ముఖ్య అతిథిగా పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌ హాజరయ్యారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

2. ఏపీలో మరో కొత్త పథకం

దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు చెందిన రోగులకు ఆర్థిక సాయం చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మరో పథకాన్ని ప్రారంభించనుంది. పోస్ట్‌ ఆపరేటివ్‌ సస్టెయినెన్స్‌ అలవెన్సు కింద రోజుకు రూ.225 చొప్పున ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఆస్పత్రుల్లో సర్జరీ తర్వాత పేద రోగులకు ఆర్థికసాయం అందించేందుకు ప్రభుత్వం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. నెలకు గరిష్టంగా రూ.5వేలు మించకుండా పోస్ట్‌ ఆపరేటివ్‌ సస్టెయినెన్స్‌ అలవెన్స్‌ కింద ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు  ఇచ్చింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

3. హైకోర్టు చెప్పినట్టే చర్చలు: ఆర్టీసీ ఎండీ

హైకోర్టు 21 అంశాలపై చర్చలు జరపాలని చెప్పిందని, ఆ విధంగానే తాము కార్మిక సంఘాల నేతలతో చర్చలు జరిపామని ఆర్టీసీ ఎండీ సునీల్‌ శర్మ తెలిపారు. తమ వారితో మాట్లాడి వస్తామని వెళ్లిన నేతలు ఇప్పటి వరకు రాలేదని పేర్కొన్నారు. జేఏసీ నేతలతో చర్చలు అసంపూర్తిగా ముగిసిన అనంతరం ఎర్రమంజిల్‌ ఈఎన్‌సీ కార్యాలయం వద్ద ఆర్టీసీ ఇన్‌ఛార్జి ఎండీ సునీల్‌శర్మ, రవాణా శాఖ కమిషనర్‌ సందీప్‌ కుమార్‌ సుల్తానియాతో కలిసి మీడియాతో మాట్లాడారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

4. 3 నగరాలకు ఆరోగ్యశ్రీ సేవల విస్తరణ

వైఎస్సార్‌ ఆరోగ్య శ్రీ సేవలను హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు నగరాలకూ వర్తింప చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయా నగరాల్లోని ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ సేవలు పొందేందుకు వీలుగా ఆరోగ్య శ్రీ పథకాన్ని విస్తరిస్తూ వైద్యారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్, చెన్నై, బెంగుళూరుల్లో ఎంప్యానల్‌ చేసిన ఆస్పత్రుల్లో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలకు ఆస్కారం కల్పిస్తూ ఈ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 17 అంశాల్లో 716 వైద్య చికిత్సలకు సూపర్ స్పెషాలిటీ వైద్యం చేయించుకునేలా ఆదేశాలను జారీ చేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

5. TS: ఇంటర్‌ ఫీజు గడువు పొడిగింపు

తెలంగాణలో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల ఫీజు చెల్లింపు గడువు నవంబరు 4 వరకు పొడిగించారు. వచ్చే ఏడాది మార్చిలో జరగనున్న మొదటి, రెండో సంవత్సరం పరీక్షలకు విద్యార్థులు రుసుము చెల్లించే గడవు ఈనెల 29తో ముగియనుంది. నవంబరు 4 వరకు విద్యార్థుల నుంచి పరీక్ష ఫీజు స్వీకరించాలని ప్రిన్సిపాళ్లకు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

6. పట్టాలెక్కిన 7000వ రైలింజన్‌

ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ ఉత్పత్తి సంస్థ చిత్తరంజన్‌ లోకోమోటివ్‌ వర్క్స్‌(సీఎల్‌డబ్ల్యూ) సరికొత్త మైలురాయిని అందుకుంది. ఈ సంస్థ ఇప్పటివరకు 7000 ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ రైళ్లను ఉత్పత్తి చేసింది. 7000వ రైలింజన్‌ను సంస్థ జనరల్‌ మేనేజర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మిశ్రా శుక్రవారం జెండా ఊపి ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రైల్వే శాఖ నేడు ట్విటర్‌ వేదికగా పంచుకుంది. 1961లో సీఎల్‌డబ్ల్యూ తొలి లోకోమోటివ్‌ను ఉత్పత్తి చేసింది. ఇప్పటివరకు ఈ సంస్థ వేర్వేరు సామర్థ్యాలు గల 17 రకాల లోకోమోటివ్‌ రైళ్లను తయారుచేసింది. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

7. ఇది ఆధునిక రామరాజ్యం: యోగి ఆదిత్యనాథ్‌

యూపీలోని ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో దీపావళి పండుగ వైభవంగా జరుగుతోంది. నగరంలోని సరయు నది ఒడ్డు సహా వివిధ ప్రాంతాల్లో 5.5 లక్షల మట్టి దీపాలను వెలిగించారు. నయా ఘాట్‌ వద్ద జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌, సీఎం హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. అంతకుముందు సీఎం మాట్లాడుతూ.. ‘‘అయోధ్య గురించి మాట్లాడినప్పుడు మన మనస్సులో రామరాజ్యం మెదులుతుంది. ప్రస్తుతం ఆధునిక రామరాజ్యం నడుస్తోంది. ఇందులో ప్రతి ఒక్కరూ అభివృద్ధి చెందుతున్నారు.’’ అని ప్రసంగించారు. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

8. తెలుగు రాష్ట్రాల్లో మొదలైన దీపావళి సందడి

9. వేలూరు జైలులో నళిని నిరాహార దీక్ష

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ హత్య కేసులో దోషిగా తేలి జీవితఖైదు అనుభవిస్తున్న నళిని శ్రీహరన్‌ మరోసారి నిరాహార దీక్షకు దిగింది. తనను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ శుక్రవారం రాత్రి నుంచి అన్నపానీయాలు ముట్టకుండా వేలూరు మహిళా జైల్లో నిరసన చేపట్టింది.  ఈ మేరకు జైలు అధికారులకు లేఖ కూడా పంపింది. తాను, తన భర్త మురుగన్‌ గత 28ఏళ్లుగా జైల్లోనే ఉంటున్నామని, ఇక తమను విడుదల చేయాలని నళిని లేఖలో పేర్కొంది. కుమార్తె వివాహం నిమిత్తం నళిని ఇటీవల కొద్ది రోజులపాటు పెరోల్‌పై బయటకు వచ్చిన విషయం తెలిసిందే. పూర్తి వార్త కోసం క్లిక్‌ చేయండి

10. ‘అల వైకుంఠపురములో..’ కొత్త సాంగ్‌ వచ్చేసింది


Tags :

జనరల్‌

రాజకీయం

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.