Array
(
    [0] => stdClass Object
        (
            [news_id] => 146646
            [news_title_telugu_html] => 

బుద్ధి మార్చుకోని ట్రంప్‌

[news_title_telugu] => బుద్ధి మార్చుకోని ట్రంప్‌ [news_title_english] => US offers to mediate again says Trump ready to assist India [news_short_description] => జమ్మూ కశ్మీర్‌ అంశంలో భారత్‌-పాకిస్థాన్‌ నడుమ మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ మరోసారి డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ భారత్-పాక్‌ అంతర్గత వ్యవహారమని నొక్కి చెబుతున్నప్పటికీ ట్రంప్‌ మాత్రం అత్యుత్సాహం చూపుతున్నారు....... [news_tags_keywords] => Donald Trump,Article 370 [news_bulletpoints] => [news_bulletpoints_html] => [news_videotype] => 0 [news_videolink] => [news_videoinfo] => khlh9UTHOsk [publish_comments_public] => 1 [publish_createdon] => 2019-08-23 10:40:26 [news_isactive] => 1 [news_status] => 2 ) )
బుద్ధి మార్చుకోని ట్రంప్‌ - US offers to mediate again says Trump ready to assist India - EENADU
close

తాజా వార్తలు

బుద్ధి మార్చుకోని ట్రంప్‌

కశ్మీర్‌ విషయంలో మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ మరోసారి వ్యాఖ్య

వాషింగ్టన్‌: జమ్మూ కశ్మీర్‌ అంశంలో భారత్‌-పాకిస్థాన్‌ మధ్య మధ్యవర్తిత్వానికి సిద్ధమంటూ మరోసారి డొనాల్డ్ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌ తమ అంతర్గత వ్యవహారమని భారత్‌ నొక్కి చెబుతున్నప్పటికీ ట్రంప్‌ మాత్రం అత్యుత్సాహం చూపుతున్నారు. భారత్‌ ట్రంప్‌ వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు తిరస్కరిస్తున్నప్పటికీ గురువారం కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ మేరకు ట్రంప్‌ ప్రభుత్వ సీనియర్‌ అధికారి మీడియాతో మాట్లాడారు.

‘కశ్మీర్‌ అంశాన్ని అమెరికా చాలా తీక్షణంగా గమనిస్తోంది. ఈ విషయంలో మేం సంయమనం పాటిస్తున్నాం. ట్రంప్‌ ఈవిషయంలో చాలా స్పష్టతతో ఉన్నారు. వారు కోరినట్లయితే ఇరు దేశాల మధ్య నెలకొన్న పరిస్థితులను చక్కదిద్దేందుకు ట్రంప్‌ సిద్ధంగా ఉన్నారు. కానీ భారత్‌ మాత్రం మధ్యవర్తిత్వం విషయంలో ఎలాంటి అభ్యర్థన చేయడం లేదు. ఈ వారం చివర్లో ఫ్రాన్స్‌లో ప్రధాని నరేంద్ర మోదీని ట్రంప్‌ కలుస్తారు. ప్రాంతీయ ఉద్రిక్తతలను తగ్గించడానికి మోదీ ఎలాంటి ప్రణాళికలు వేసుకున్నారో ట్రంప్‌ తెలుసుకోవాలనుకుంటున్నారు’  అని తెలిపారు.

కశ్మీర్‌కు స్వయంప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత భారత్‌-పాక్‌ మధ్య పరిస్థితులు మరింత వేడెక్కాయి. అంతర్జాతీయ సమాజం ఇది ఇరు దేశాల అంతర్గత విషయం, సంయమనం పాటించాలని చెబుతోంది. ట్రంప్‌ మాత్రం ఈ విషయంలో రెండు నాల్కల ధోరణితో వ్యవహరిస్తున్నారు. ఓ వైపు సంయమనం పాటించాలని చెబుతూనే ఇరు దేశాల మధ్య పరిస్థితులు చక్కదిద్దడానికి మధ్యవర్తిగా ఉంటానని చెబుతున్నారు. ఈ క్రమంలో రెండు రోజుల క్రితం ఆయనే స్వయంగా ఈ విషయంపై ట్వీట్‌ చేశారు. కశ్మీర్‌ చాలా క్లిష్టమైన అంశమని, ఇరు దేశాలు కోరినట్లయితే మధ్యవర్తిగా ఉంటానని అంటున్నారు.



Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.