close

తాజా వార్తలు

‘కామసూత్ర’ వెబ్‌సిరీస్‌లో సన్నీలియోనీ..?

ముంబయి:  బాలీవుడ్‌ నటి సన్నీలియోనీ ప్రస్తుతం ‘స్ప్లిట్స్‌విల్లా సీజన్‌ 12’లో బిజీగా ఉన్నారు. త్వరలో ఆమె ఏక్తాకపూర్‌ దర్శకత్వంలో రానున్న ‘కామసూత్ర’ వెబ్‌సిరీస్‌లో నటించనున్నారని బాలీవుడ్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజా సమాచారం ప్రకారం.. బాలీవుడ్‌ దర్శకురాలు ఏక్తా కపూర్‌ ‘కామసూత్ర’ ఆధారంగా చేసుకుని ఓ వెబ్‌సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఈ వెబ్‌సిరీస్‌లో నటించమని సన్నీలియోనీతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారట. కథ విన్న సన్నీలియోనీ ఇందులో నటించేందుకు సుముఖంగా ఉన్నారని బాలీవుడ్‌ వర్గాలు తెలిపాయి. దీనికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఏక్తాకపూర్‌, సన్నీలియోనీ కలిసి ‘రాగిణి-ఎంఎంఎస్‌2 ’ చిత్రం కోసం పనిచేసిన విషయం తెలిసిందే.

ఈ ఏడాదిలో వచ్చిన ‘మధుర రాజా’ చిత్రంలో సన్నీలియోనీ నటించారు. అంతేకాకుండా ప్రస్తుతం ఆమె ‘వీరమాదేవి’ చిత్రంలో నటిస్తున్నారు. తమిళంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నీలియోనీ కీలకపాత్రలో కనిపించనున్నారు.


Tags :

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2019 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.