News In Pics: చిత్రం చెప్పే సంగతులు-2 (24-03-2023)

.

Updated : 24 Mar 2023 20:21 IST
1/33
సినీనటి బిందుమాధవి తాజా ఫొటోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన ‘యాంగర్‌ టేల్స్‌’ వెబ్‌సిరీస్‌లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది. సినీనటి బిందుమాధవి తాజా ఫొటోలను పలువురు సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఇటీవల ఓటీటీ వేదికగా విడుదలైన ‘యాంగర్‌ టేల్స్‌’ వెబ్‌సిరీస్‌లో ఆమె నటన ప్రేక్షకులను ఆకట్టుకుంది.
2/33
3/33
సినీనటుడు రామ్‌చరణ్‌ ఈ నెల 27వ తేదీన జన్మదిన వేడుకలను చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన కామన్‌ డీపీని విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూసి చెర్రీ ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు. సినీనటుడు రామ్‌చరణ్‌ ఈ నెల 27వ తేదీన జన్మదిన వేడుకలను చేసుకోనున్నారు. ఈ నేపథ్యంలో వేడుకలకు సంబంధించిన కామన్‌ డీపీని విడుదల చేశారు. ఈ పోస్టర్‌ను చూసి చెర్రీ ఫ్యాన్స్‌ సంబరపడిపోతున్నారు.
4/33
ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు ప్రధాన తారాగణంగా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కృష్ణవంశీ.. సినిమాలో నటించిన బ్రహ్మానందాన్ని సన్మానించారు. ఆయన నటన బాగుందని కితాబిచ్చారు. ప్రకాశ్‌రాజ్‌, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, శివాత్మిక రాజశేఖర్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ తదితరులు ప్రధాన తారాగణంగా దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన చిత్రం ‘రంగమార్తాండ’. ఈ సినిమా ఉగాది కానుకగా మార్చి 22న విడుదలై ప్రేక్షకుల్ని విశేషంగా అలరిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు కృష్ణవంశీ.. సినిమాలో నటించిన బ్రహ్మానందాన్ని సన్మానించారు. ఆయన నటన బాగుందని కితాబిచ్చారు.
5/33
విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, కార్తి ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’. సినిమా ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. విక్రమ్‌, జయం రవి, ఐశ్వర్య రాయ్‌, త్రిష, కార్తి ప్రధాన పాత్రల్లో మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘పొన్నియిన్‌ సెల్వన్‌ 2’. సినిమా ట్రైలర్‌ను ఈ నెల 29న విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. ఇప్పటికే ఈ సినిమా మొదటి భాగం ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.
6/33
హైదరాబాద్‌లోని మదీనగూడలో జైలు థీమ్‌తో ఏర్పాటు చేసిన ఓ మండీని సినీనటి హనీరోజ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి వంటకాలను ఆమె రుచి చూశారు. హైదరాబాద్‌లోని మదీనగూడలో జైలు థీమ్‌తో ఏర్పాటు చేసిన ఓ మండీని సినీనటి హనీరోజ్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా అక్కడి వంటకాలను ఆమె రుచి చూశారు.
7/33
వంటకాలను చూపుతున్న హనీరోజ్‌ వంటకాలను చూపుతున్న హనీరోజ్‌
8/33
ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సంకురాత్రి చంద్రశేఖర్‌ శుక్రవారం తన స్వస్థలం కాకినాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, విద్యార్థులు ఆయనకు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు. ఇటీవల పద్మశ్రీ అవార్డు అందుకున్న సంకురాత్రి ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు సంకురాత్రి చంద్రశేఖర్‌ శుక్రవారం తన స్వస్థలం కాకినాడకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ప్రజలు, విద్యార్థులు ఆయనకు పూలు చల్లుతూ ఘనస్వాగతం పలికారు.
9/33
విశాఖలో సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ 2023లో భాగంగా ముంబయి హీరోస్, భోజ్‌పురి దబంగ్స్‌ మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల తారలు గ్రౌండ్‌లో ఆడుతున్న క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ కనిపించారు. విశాఖలో సెలబ్రిటీ క్రికెట్‌ లీగ్‌ 2023లో భాగంగా ముంబయి హీరోస్, భోజ్‌పురి దబంగ్స్‌ మధ్య సెమీఫైనల్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ నేపథ్యంలో ఇరు జట్ల తారలు గ్రౌండ్‌లో ఆడుతున్న క్రీడాకారులను ఉత్సాహపరుస్తూ కనిపించారు.
10/33
విశాఖలో గ్రౌండ్ బయట సినీతారల సందడి విశాఖలో గ్రౌండ్ బయట సినీతారల సందడి
11/33
సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘శాకుంతలం’.  ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హరీశ్ ఉత్తమన్‌.. విక్రోదనేమిగా, సుబ్బరాజు.. అతిక్రోదనేమి పాత్ర పోషించినట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకుంది. సమంత, దేవ్‌మోహన్‌ ప్రధాన పాత్రల్లో గుణశేఖర్‌ తెరకెక్కించిన అపురూప దృశ్య కావ్యం ‘శాకుంతలం’. ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో హరీశ్ ఉత్తమన్‌.. విక్రోదనేమిగా, సుబ్బరాజు.. అతిక్రోదనేమి పాత్ర పోషించినట్లు తెలుపుతూ చిత్రబృందం ఈ పోస్టర్‌ను ట్విటర్‌ వేదికగా పంచుకుంది.
12/33
కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేష్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్‌ అబ్బవరం రాజమహేంద్రవరంలోని ఐఎస్‌టీఎస్‌ మహిళా కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం వారితో సెల్ఫీ తీసుకొని జోష్‌ నింపారు. కిరణ్‌ అబ్బవరం, అతుల్య రవి జంటగా రమేష్‌ కాదూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘మీటర్‌’. ఏప్రిల్‌ 7న థియేటర్లలో విడుదల కానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరణ్‌ అబ్బవరం రాజమహేంద్రవరంలోని ఐఎస్‌టీఎస్‌ మహిళా కళాశాలను సందర్శించి విద్యార్థులతో ముచ్చటించారు. అనంతరం వారితో సెల్ఫీ తీసుకొని జోష్‌ నింపారు.
13/33
రంజాన్‌ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా అహ్మదాబాద్‌లో ముస్లింలు ప్రార్థనలు చేస్తూ కనిపించారు. రంజాన్‌ మాసంలో మొదటి శుక్రవారం సందర్భంగా అహ్మదాబాద్‌లో ముస్లింలు ప్రార్థనలు చేస్తూ కనిపించారు.
14/33
ముంబయిలో గురువారం నిర్వహించిన ‘ఇండియన్‌ స్పోర్ట్స్‌ హానర్స్‌’ రెడ్‌ కార్పెట్‌ కార్యక్రమంలో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్కశర్మ ఇలా మెరిశారు. ముంబయిలో గురువారం నిర్వహించిన ‘ఇండియన్‌ స్పోర్ట్స్‌ హానర్స్‌’ రెడ్‌ కార్పెట్‌ కార్యక్రమంలో క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ, ఆయన సతీమణి అనుష్కశర్మ ఇలా మెరిశారు.
15/33
16/33
పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను జులై 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో ఈ మెగా మల్టీస్టారర్‌ సినిమా కోసం వేచిచూస్తున్న ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు. పవన్‌ కల్యాణ్‌, సాయిధరమ్‌ తేజ్‌ ప్రధాన పాత్రల్లో సముద్రఖని దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాను జులై 28న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. దీంతో ఈ మెగా మల్టీస్టారర్‌ సినిమా కోసం వేచిచూస్తున్న ఫ్యాన్స్‌ ఖుషీ అవుతున్నారు.
17/33
నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా (Dasara)’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ‘ధూమ్‌ధామ్‌ దసరా’ పేరుతో అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది. నాని (Nani), కీర్తి సురేష్‌ (Keerthy Suresh) జంటగా నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘దసరా (Dasara)’. శ్రీకాంత్‌ ఓదెల దర్శకుడు. మార్చి 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 26న ‘ధూమ్‌ధామ్‌ దసరా’ పేరుతో అనంతపురంలోని ఆర్ట్స్‌ కళాశాల గ్రౌండ్‌లో ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ను నిర్వహిస్తున్నట్లు చిత్రబృందం తెలిపింది.
18/33
శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్‌ కాలనీ వివేకానందనగర్‌ రోడ్డు మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో అంబులెన్సుల్లో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివేకానందనగర్‌ నుంచి జేఎన్టీయూ వరకు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 3గంటల వరకు కూకట్‌పల్లి, కేపీహెచ్‌బీ, భాగ్యనగర్‌ కాలనీ వివేకానందనగర్‌ రోడ్డు మార్గాల్లో భారీగా ట్రాఫిక్‌ నిలిచిపోయింది. దీంతో అంబులెన్సుల్లో ఉన్న రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వివేకానందనగర్‌ నుంచి జేఎన్టీయూ వరకు భారీగా వాహనాలు నిలిచిపోవడంతో ప్రయాణికుల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది.
19/33
విష్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఈ నెల 22న థియేటర్లలో విడుదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ చేరుకున్న విష్వక్‌సేన్‌.. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం జయరామ థియేటర్‌లో ‘దాస్‌ కా ధమ్కీ’ నూన్‌ షోను వీక్షించి అభిమానులతో ముచ్చటించారు. విష్వక్‌సేన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘దాస్‌ కా ధమ్కీ’. నివేదా పేతురాజ్‌ కథానాయిక. ఈ నెల 22న థియేటర్లలో విడుదలైంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయవాడ చేరుకున్న విష్వక్‌సేన్‌.. ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మను దర్శించుకున్నారు. అనంతరం జయరామ థియేటర్‌లో ‘దాస్‌ కా ధమ్కీ’ నూన్‌ షోను వీక్షించి అభిమానులతో ముచ్చటించారు.
20/33
సినీనటి పవిత్ర లోకేశ్‌ (Pavitra Lokesh), సీనియర్ నటుడు నరేష్‌ (Naresh) జంటగా నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ మేరకు ‘మళ్లీ పెళ్లి’ టైటిల్‌ పోస్టర్‌, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం. సినీనటి పవిత్ర లోకేశ్‌ (Pavitra Lokesh), సీనియర్ నటుడు నరేష్‌ (Naresh) జంటగా నటిస్తున్న చిత్రానికి టైటిల్‌ ఖరారైంది. ఎంఎస్‌ రాజు దర్శకత్వంలో ఈ చిత్రం రాబోతోంది. ఈ మేరకు ‘మళ్లీ పెళ్లి’ టైటిల్‌ పోస్టర్‌, గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ చిత్రాన్ని విజయకృష్ణ మూవీస్ పతాకంపై నరేష్ స్వయంగా నిర్మిస్తుండటం విశేషం.
21/33
‘ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం’ సందర్భంగా క్షయపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. క్షయ వ్యాధిని అంతమొందించేందుకు ప్రతిఒక్కరూ చేతులు కలపాలని ఆయన సూచించారు. ‘ప్రపంచ క్షయ వ్యాధి నివారణ దినోత్సవం’ సందర్భంగా క్షయపై అవగాహన కల్పిస్తూ ప్రముఖ కళాకారుడు సుదర్శన్‌ పట్నాయక్‌ ఒడిశాలోని పూరీ తీరంలో సైకత శిల్పాన్ని తీర్చిదిద్దారు. క్షయ వ్యాధిని అంతమొందించేందుకు ప్రతిఒక్కరూ చేతులు కలపాలని ఆయన సూచించారు.
22/33
భద్రాచలంలోని సీతారాముల ఆలయంలో శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న హోమం రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ఈనెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుక కోసం ఈ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు. భద్రాచలంలోని సీతారాముల ఆలయంలో శ్రీరామ నవమి తిరు కల్యాణ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న హోమం రెండో రోజు శుక్రవారం కొనసాగింది. ఈనెల 31న జరగనున్న పుష్కర సామ్రాజ్య పట్టాభిషేక వేడుక కోసం ఈ ఏర్పాట్లు చేశారు. సాయంత్రం స్వామివారికి తిరువీధి సేవ నిర్వహించనున్నారు.
23/33
అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్‌’. ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ ‘ఏందే ఏందే’ పాటను ఈరోజు సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 28న ‘ఏజెంట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అఖిల్‌ అక్కినేని, సాక్షి వైద్య జంటగా సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఏజెంట్‌’. ఈ సినిమాలోని సెకండ్‌ సింగిల్‌ ‘ఏందే ఏందే’ పాటను ఈరోజు సాయంత్రం 6గంటలకు విడుదల చేయనున్నారు. ఏప్రిల్‌ 28న ‘ఏజెంట్’ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
24/33
నితిన్‌, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్రీకరణను శుక్రవారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టారు. దర్శకులు బాబీ, గోపీచంద్‌ మలినేని, హను రాఘవపూడి, బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. గతంలో నితిన్‌, రష్మిక.. ‘భీష్మ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. నితిన్‌, రష్మిక జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా చిత్రీకరణను శుక్రవారం ముహూర్తపు షాట్‌తో ప్రారంభించారు. కార్యక్రమానికి ప్రముఖ నటుడు చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై క్లాప్‌ కొట్టారు. దర్శకులు బాబీ, గోపీచంద్‌ మలినేని, హను రాఘవపూడి, బుచ్చిబాబు సానా పాల్గొన్నారు. గతంలో నితిన్‌, రష్మిక.. ‘భీష్మ’ సినిమాలో నటించిన విషయం తెలిసిందే.
25/33
26/33
ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పంచుమర్తి అనురాధ శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో ఎమ్మెల్సీగా గెలుపొందిన పంచుమర్తి అనురాధ శుక్రవారం తెదేపా అధినేత చంద్రబాబు నాయుడిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
27/33
తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ ఉద్యోగులు ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధాలో మహాధర్నా చేపట్టారు. వేతన సవరణ, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్మాకు వివిధ జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. దీంతో విద్యుత్‌ సౌధా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. ఖైరతాబాద్‌-పంజాగుట్ట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి. తమ సమస్యల పరిష్కారం కోరుతూ విద్యుత్‌ ఉద్యోగులు ఖైరతాబాద్‌లోని విద్యుత్‌ సౌధాలో మహాధర్నా చేపట్టారు. వేతన సవరణ, ఆర్టిజన్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ ధర్మాకు వివిధ జిల్లాల నుంచి భారీగా ఉద్యోగులు తరలివచ్చారు. దీంతో విద్యుత్‌ సౌధా పరిసరాల్లో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ నెలకొంది. ఖైరతాబాద్‌-పంజాగుట్ట రహదారిపై భారీగా వాహనాలు నిలిచిపోయాయి.
28/33
విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన కారణంగా రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు విద్యుత్‌ ఉద్యోగుల ఆందోళన కారణంగా రహదారిపై నిలిచిపోయిన రాకపోకలు
29/33
రాహుల్‌గాంధీకి శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కరీంనగర్‌లోని కోతి రాంపూర్‌ సెంటర్‌లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి. రాహుల్‌గాంధీకి శిక్ష విధిస్తూ సూరత్‌ కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో కరీంనగర్‌లోని కోతి రాంపూర్‌ సెంటర్‌లో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు నిరసన దీక్ష చేపట్టాయి.
30/33
బాసర ఆలయంలో పునర్నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ముథోల్‌ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బాసర ఆలయంలో పునర్నిర్మాణ పనులకు మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో ముథోల్‌ ఎమ్మెల్యే విఠ‌ల్ రెడ్డి, కలెక్టర్ వరుణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
31/33
ఎన్టీపీసీ రామగుండంలో నిర్మిస్తోన్న తెలంగాణ ప్రాజెక్ట్‌లో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల విద్యుత్‌  ప్రాజెక్టు ఒకటో యూనిట్‌లో సింక్రనైజేషన్‌ పూర్తిచేశారు. మూడు రోజుల క్రితం నిర్మాణ పనులు పూర్తి కాగా ఈ రోజు ఉదయం వరకు 100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. ఎన్టీపీసీ రామగుండంలో నిర్మిస్తోన్న తెలంగాణ ప్రాజెక్ట్‌లో శుక్రవారం తెల్లవారుజామున విద్యుత్‌ ఉత్పత్తి ప్రారంభమైంది. కొత్తగా నిర్మిస్తున్న 800 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు ఒకటో యూనిట్‌లో సింక్రనైజేషన్‌ పూర్తిచేశారు. మూడు రోజుల క్రితం నిర్మాణ పనులు పూర్తి కాగా ఈ రోజు ఉదయం వరకు 100 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి చేశారు.
32/33
నెల్లూరు నుంచి దాదాపు 300 కార్లతో కోటంరెడ్డి అనుచరులు ఈ ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని కస్తూరి గార్డెన్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. మంగళగిరి వరకు కొనసాగనుంది. గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా  అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ  ప్రారంభం సందర్భంగా మహిళలు ఆయనకు గుమ్మడికాయలతో హారతిచ్చారు. నెల్లూరు నుంచి దాదాపు 300 కార్లతో కోటంరెడ్డి అనుచరులు ఈ ర్యాలీని ప్రారంభించారు. నగరంలోని కస్తూరి గార్డెన్స్ నుంచి ప్రారంభమైన ర్యాలీ.. మంగళగిరి వరకు కొనసాగనుంది. గిరిధర్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరుతున్న సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు అక్కడికి చేరుకొని తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ర్యాలీ ప్రారంభం సందర్భంగా మహిళలు ఆయనకు గుమ్మడికాయలతో హారతిచ్చారు.
33/33
హాట్ పాలిటిక్స్ వేళ విజయవాడలోని ఓ దుకాణంలో స్వీట్‌ తయారు చేస్తున్న సీపీఐ నేత నారాయణ హాట్ పాలిటిక్స్ వేళ విజయవాడలోని ఓ దుకాణంలో స్వీట్‌ తయారు చేస్తున్న సీపీఐ నేత నారాయణ

మరిన్ని