ఎక్సినోస్ ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్‌..ఫీచర్లివే

ఎక్సినోస్ ప్రాసెసర్‌తో శాంసంగ్ గెలాక్సీ ఏ12 స్మార్ట్‌ఫోన్‌..ఫీచర్లివే

1/10

ఆగస్టు నెలలో వరుస ఫోన్లు విడుదల చేస్తున్న శాంసంగ్..తాజాగా ఎక్సినోస్ ప్రాసెసర్‌తో గెలాక్సీ ఏ12 ఫోన్‌ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. మధ్యశ్రేణి మార్కెట్ లక్ష్యంగా ఈ మోడల్‌ను తీసుకొచ్చింది.

2/10

5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. ఇది 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.

3/10

శాంసంగ్ రూపొందించిన ఎక్సినోస్ 850 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. 4జీబీ, 6జీబీ ర్యామ్‌ వేరియంట్లో తీసుకొచ్చారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో శాంసంగ్ మీడియాటెక్‌ హీలియో పీ35 ప్రాసెసర్‌తో ఏ12 మోడల్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే.

4/10

గెలాక్సీ ఏ12లో 6.5-అంగుళాల హెచ్‌డీ+ పీఎల్ఎస్‌ టీఎఫ్‌టీ డిస్‌ప్లే ఇస్తున్నారు.

5/10

గెలాక్సీ ఏ12లో శాంసంగ్ నాక్స్ (Knox) సెక్యూరిటీ ఫీచర్ ఇస్తున్నారు. ఫోన్ ఆన్‌ చేసిన రోజు నుంచి ఇందులోని మల్టీ లేయర్ సెక్యూరిటీ ఫీచర్ మాల్‌వేర్‌ల నుంచి ముఖ్యమైన సమాచారానికి రక్షణ కల్పిస్తుందని శాంసంగ్ తెలిపింది.

6/10

ఇందులో ఐదు కెమెరాలున్నాయి. వెనుకవైపు 48ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 5ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్, రెండు 2 ఎంపీ కెమెరాలు ఇస్తున్నారు.

7/10

ముందుభాగంలో వీడియో కాలింగ్, సెల్ఫీల కోసం 8ఎంపీ కెమెరా అమర్చారు.

8/10

ఆండ్రాయిడ్ 11 ఆధారిత వన్‌యూఐ కోర్ ఓఎస్‌తో ఈ ఫోన్ పనిచేస్తుంది.

9/10

4జీబీ ర్యామ్‌/64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ వేరియంట్ ధర రూ. 13,999కాగా, 6జీబీ/128జీబీ వేరియంట్‌ ధర రూ. 14,999గా శాంసంగ్ నిర్ణయించింది.

10/10

ఆగస్టు 12 తేదీ నుంచి శాంసంగ్‌ వెబ్‌సైట్‌లో అమ్మకాలు ప్రారంభమయ్యాయి. బ్లాక్, బ్లూ, వైట్ రంగుల్లో లభిస్తుంది.


ఫొటోలు

తాజా మరిన్ని

సినిమా మరిన్ని

స్పోర్ట్స్ మరిన్ని

లైఫ్ స్టైల్ మరిన్ని

భ‌క్తి మరిన్ని

కొత్తగా మరిన్ని

జిల్లా వార్తలు

దేవ‌తార్చ‌న

మరిన్ని