News in Pics: చిత్రం చెప్పే సంగతులు-01(31-01-2023)

Updated : 31 Jan 2023 11:03 IST
1/20
ఏపీ, కర్ణాటక సరిహద్దు చిత్తూరు జిల్లా వి.కోట మండలం చెల్దిగానిపల్లికి వెళ్లే మార్గంలో రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల వద్ద వందల సంఖ్యలో గబ్బిలాలు ఉంటున్నాయి. ఒక్కోసారి ఆకాశంలో విహరిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, యాత్రికులు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఏపీ, కర్ణాటక సరిహద్దు చిత్తూరు జిల్లా వి.కోట మండలం చెల్దిగానిపల్లికి వెళ్లే మార్గంలో రహదారికి ఇరువైపులా ఉన్న చెట్ల వద్ద వందల సంఖ్యలో గబ్బిలాలు ఉంటున్నాయి. ఒక్కోసారి ఆకాశంలో విహరిస్తూ కనువిందు చేస్తున్నాయి. ఈ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, యాత్రికులు వాటిని ఆసక్తిగా తిలకిస్తున్నారు.
2/20
తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. యువ నేత.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో యువతులతో స్వీయ చిత్రం తీసుకున్న చిత్రమిది. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్ర నాలుగో రోజు ఉత్సాహంగా కొనసాగింది. యువ నేత.. చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గంలో పర్యటించిన నేపథ్యంలో యువతులతో స్వీయ చిత్రం తీసుకున్న చిత్రమిది.
3/20
నల్లగొండ గుట్టపై స్వామివారి ఆలయానికి వెళ్లడానికి నిర్మించిన ఘాట్‌ రోడ్డు వర్షాలకు గుంతలు పడుతూ అత్యంత ప్రమాదకరంగా ఉంది.భక్తుల సౌకర్యార్థం తారు లేదా సీసీ రోడ్డు నిర్మాణం, రోడ్డుకు ఓ వైపు మురుగుకాల్వ నిర్మాణంలో పాటు ప్రమాదాల నివారణకు కంచెలు, అడ్డు గోడలు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు. నల్లగొండ గుట్టపై స్వామివారి ఆలయానికి వెళ్లడానికి నిర్మించిన ఘాట్‌ రోడ్డు వర్షాలకు గుంతలు పడుతూ అత్యంత ప్రమాదకరంగా ఉంది.భక్తుల సౌకర్యార్థం తారు లేదా సీసీ రోడ్డు నిర్మాణం, రోడ్డుకు ఓ వైపు మురుగుకాల్వ నిర్మాణంలో పాటు ప్రమాదాల నివారణకు కంచెలు, అడ్డు గోడలు నిర్మించాలని భక్తులు కోరుతున్నారు.
4/20
జీవితంలో కొద్దిపాటి ఒడుదొడుకులు వచ్చినా కొంతమంది మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. హనుమకొండ సర్క్యూట్ గెస్ట్‌ హౌస్‌ ప్రధాన రహదారి వద్ద రోడ్డు విస్తరణలో మర్రిచెట్టును కొట్టివేసి, అనంతరం కాల్చారు. అయినా ఆ వృక్షం మాత్రం చిగురేసి, ఇలా ఆకులతో కనిపిస్తోంది. అధైర్య పడొద్దు, జీవితంలో ముందుకు సాగాలి అన్న సందేశం ఇస్తున్నట్లు ఉంది కదూ..! జీవితంలో కొద్దిపాటి ఒడుదొడుకులు వచ్చినా కొంతమంది మానసికంగా కుంగిపోయి ఆత్మహత్యలకు పాల్పడుతుంటారు. హనుమకొండ సర్క్యూట్ గెస్ట్‌ హౌస్‌ ప్రధాన రహదారి వద్ద రోడ్డు విస్తరణలో మర్రిచెట్టును కొట్టివేసి, అనంతరం కాల్చారు. అయినా ఆ వృక్షం మాత్రం చిగురేసి, ఇలా ఆకులతో కనిపిస్తోంది. అధైర్య పడొద్దు, జీవితంలో ముందుకు సాగాలి అన్న సందేశం ఇస్తున్నట్లు ఉంది కదూ..!
5/20
పెంపుడు జంతువుల స్నానానికి టబ్స్‌, గోళ్ల కత్తిరింపు, హెయిర్ డ్రెసింగ్‌, అలంకరణ వంటి సేవలందించే ఓ అంకుర సంస్థకు చెందిన రెండు వ్యాన్‌లను సోమవారం రాయదుర్గం టీ హబ్ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలకరించిన శునకంతో నటి స్పందన సందడి చేశారు. పెంపుడు జంతువుల స్నానానికి టబ్స్‌, గోళ్ల కత్తిరింపు, హెయిర్ డ్రెసింగ్‌, అలంకరణ వంటి సేవలందించే ఓ అంకుర సంస్థకు చెందిన రెండు వ్యాన్‌లను సోమవారం రాయదుర్గం టీ హబ్ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అలకరించిన శునకంతో నటి స్పందన సందడి చేశారు.
6/20
కింగ్‌కోఠిలోని సెయింట్‌ జోసఫ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ‘జాతీయ యువజనోత్స’వాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆధునిక, సంప్రదాయ వస్ర్తధారణలో యువతీయువకులు ర్యాంప్‌పై ఆకట్టుకున్నారు. కింగ్‌కోఠిలోని సెయింట్‌ జోసఫ్ డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో ‘జాతీయ యువజనోత్స’వాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆధునిక, సంప్రదాయ వస్ర్తధారణలో యువతీయువకులు ర్యాంప్‌పై ఆకట్టుకున్నారు.
7/20
ప్రకాశం బ్యారేజి సమీపంలో సీతానగరం కొండ దిగువన కృష్ణా పుష్కరాల సమయంలో రూ.లక్షలు ఖర్చు చేసి పచ్చదనంతో పార్కును అభివృద్ధి చేశారు. నేడు కొండరాళ్లు పడుతున్నాయనే సాకుతో దానిని నిర్లక్ష్యం చేశారు. దీంతో పచ్చదనం మొత్తం నిర్వీర్యమై కళావిహీనంగా మారింది. 

8/20
రైతులు పంటసాగు చేసేందుకు పడే కష్టం అంతాఇంతా కాదు. అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలో ప్రవహించే హెచ్చెల్సీ కాలువలో రైతులు కాస్తంత దూరంగా ఉన్న తమ పొలాలకు పెద్దపెద్ద పైపులు వేసి పంటలకు నీరందిస్తున్నారు. పెనకచర్ల, రాకెట్ల తదితర గ్రామ ప్రజలు ఎంతో సుదూరంలో ఉన్న పొలాలకు పైపుల ద్వారా ఇలా నీరందిస్తున్నారు.

9/20
తెలంగాణ  రాష్ట్ర ప్రభుత్వం మిల్లర్లకు విధించిన సీఎంఆర్‌ బియ్యం గడువు జనవరి 31వ తేదీతో ముగియనుంది. దీంతో రైస్‌ మిల్లుల నుంచి ఎఫ్‌సీఐ గోదాములకు పంపిన ధాన్యం లారీలు  నల్గొండ కలెక్టరేట్‌ ప్రాంతంలో బారులుతీరాయి. బకాయి పడ్డ రైస్‌ మిల్లుల నుంచి అన్నీ ఒకేసారి రావడంతో దారులన్నీ లారీలతో నిండిపోయాయి. 

10/20
హైదరాబాద్‌లోని సంజీవయ్య పార్కు చెంత హుస్సేన్‌ సాగర్‌ నీటిలో.. కొంగలు, మయూరాలు, ఇతర పక్షులు విహరిస్తున్న చిత్రాలివి. సోమవారం సాయంత్రం పచ్చని చెట్ల మధ్య, గడ్డివనంలో సేదతీరుతూ సందర్శకులకు ఇలా కనువిందు చేశాయి.

11/20
  హైదరాబాద్‌ గచ్చిబౌలి ఐటీ కారిడార్‌లో పాదచారులు నడిచేందుకు కాలిబాటలు లేకపోవడంతో చాలామంది రోడ్డు పక్కన భయంభయంగా నడుచుకుంటూ.. వేగంగా దూసుకొస్తున్న వాహనాలను తప్పించుకుంటూ వెళ్తున్నారు. గచ్చిబౌలి ట్రాఫిక్‌ స్టేషన్‌ రహదారిపై పాదచారుల ఇక్కట్లను చిత్రాల్లో చూడొచ్చు.

12/20
 హైదరాబాద్ షేక్‌పేట ఓయూ కాలనీ వేంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాల్లో సోమవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ కనులపండువగా సాగింది. వేయిదీపాలతో ఆలయం కొత్త కాంతులు సంతరించుకుంది.  

హైదరాబాద్ షేక్‌పేట ఓయూ కాలనీ వేంకటేశ్వరాలయ బ్రహ్మోత్సవాల్లో సోమవారం సాయంత్రం సహస్ర దీపాలంకరణ కనులపండువగా సాగింది. వేయిదీపాలతో ఆలయం కొత్త కాంతులు సంతరించుకుంది.
13/20
సమతామూర్తి స్ఫూర్తికేంద్రం శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తొలి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ శివారులోని శ్రీరామనగరంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి తెలిపారు. సమతామూర్తి స్ఫూర్తికేంద్రం శ్రీరామానుజాచార్య-108 దివ్యదేశాల తొలి వార్షికోత్సవం సందర్భంగా హైదరాబాద్‌ శివారులోని శ్రీరామనగరంలో ఫిబ్రవరి 2 నుంచి 12 వరకూ బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు త్రిదండి రామానుజ చినజీయర్‌ స్వామి తెలిపారు.
14/20
విశాఖ ఆటోనగర్‌ ప్రాంతంలోని ఓ ఇంటి పెరట్లో మూడు, రెండు అంగుళాల ఎత్తులో ఉన్న బెండ మొక్కలు కాయలు కాస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.

విశాఖ ఆటోనగర్‌ ప్రాంతంలోని ఓ ఇంటి పెరట్లో మూడు, రెండు అంగుళాల ఎత్తులో ఉన్న బెండ మొక్కలు కాయలు కాస్తుండటంతో స్థానికులు ఆసక్తిగా చూస్తున్నారు.
15/20
 ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలంలోని భూదేవిపేట గ్రామానికి చెందిన పి.హరిబాలకృష్ణ అనే రైతు వేలేరుపాడు సమీపంలో మిరప సాగు చేస్తున్నారు. తోటలో త్రిశూలం ఆకారంలో మిరపకాయ కాసింది. స్థానికులు దీన్ని ఆసక్తిగా తిలకిస్తున్నారు.

16/20
మేడ్చల్‌-మల్కాజిగిరి జిల్లా మైసమ్మగూడలోని మల్లారెడ్డి వర్సిటీలో ‘ఆటిట్యూడ్‌ ఈజ్‌ ఎవ్రీథింగ్‌’ పేరుతో అంతర్జాతీయ ప్రఖ్యాత ప్రేరణ వక్త, రచయిత నిక్‌ వుజిసిక్‌  కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా లక్ష్యాన్ని వీడొద్దని ఆయన విద్యార్థులకు సూచించారు.

17/20
గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైన ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిన ఉత్తరాఖండ్‌ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది.

గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశ రాజధాని దిల్లీలో తమ రాష్ట్రంలోని ప్రకృతి సౌందర్యాన్ని, అపూర్వమైన ఆధ్యాత్మికతను కళ్లకు కట్టిన ఉత్తరాఖండ్‌ శకటానికి రాష్ట్రాల విభాగంలో ప్రథమ స్థానం దక్కింది.
18/20
   శ్రీనగర్‌లో భారీ హిమపాతం కారణంగా మంచు పేరుకుపోయిన కార్లు.

శ్రీనగర్‌లో భారీ హిమపాతం కారణంగా మంచు పేరుకుపోయిన కార్లు.
19/20
 అయోధ్య రామాలయంలో సీతారాముల విగ్రహాలను రూపొందించేందుకు నేపాల్‌లోని జనక్‌పుర్‌ నుంచి భారత్‌కు తీసుకొస్తున్న సాలగ్రామ శిల.

అయోధ్య రామాలయంలో సీతారాముల విగ్రహాలను రూపొందించేందుకు నేపాల్‌లోని జనక్‌పుర్‌ నుంచి భారత్‌కు తీసుకొస్తున్న సాలగ్రామ శిల.
20/20
 జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వాటిని వెళ్లగొట్టేందుకు ఓ కొండముచ్చును కొనుగోలు చేసి గ్రామంలో తిప్పుతున్నారు. ఇటీవల గ్రామంలో గుంపుగా తిరుగుతున్న కోతులు కొండముచ్చును చూసి ఒక్కసారిగా ఇలా పక్కనే ఉన్న రెండంతస్తుల ఇంటిపైకి ఎక్కినప్పుడు తీసిన చిత్రమిది. జోగులాంబ గద్వాల జిల్లా ఉండవల్లి మండల కేంద్రంలో కోతుల బెడద తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో వాటిని వెళ్లగొట్టేందుకు ఓ కొండముచ్చును కొనుగోలు చేసి గ్రామంలో తిప్పుతున్నారు. ఇటీవల గ్రామంలో గుంపుగా తిరుగుతున్న కోతులు కొండముచ్చును చూసి ఒక్కసారిగా ఇలా పక్కనే ఉన్న రెండంతస్తుల ఇంటిపైకి ఎక్కినప్పుడు తీసిన చిత్రమిది.

మరిన్ని