​​​​​​సుప్రీం కోర్టులో సచిన్‌ వర్గం పిటిషన్‌

తాజా వార్తలు

Published : 23/07/2020 02:07 IST

​​​​​​సుప్రీం కోర్టులో సచిన్‌ వర్గం పిటిషన్‌

జైపుర్‌: రాజస్థాన్‌ రాజకీయం రసకందాయంలో పడింది. కాంగ్రెస్‌లో అసమ్మతి వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. అటు స్పీకర్‌, ఇటు తిరుగుబాటు నేత సచిన్‌ పైలట్‌ సుప్రీంకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు.

సచిన్‌ పైలట్‌ సహా 19 మంది ఎమ్మెల్యేలపై శుక్రవారం వరకు ఎలాంటి చర్యలూ తీసుకోవద్దంటూ రాజస్థాన్‌ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై రాజస్థాన్‌ స్పీకర్‌ సీపీ జోషి సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పీకర్‌దే తుది నిర్ణయమని, అనర్హతపై స్పీకర్‌ నిర్ణయం తీసుకున్న తర్వాత మాత్రమే న్యాయ సమీక్షకు అవకాశం ఉంటుంని పేర్కొన్నారు.

మరోవైపు స్పీకర్‌కు చెక్‌ పెట్టేందుకు సచిన్‌ పైలట్‌ వర్గం కూడా సుప్రీంకోర్టు కేవియట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. తమ వాదన వినకుండా స్పీకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై ఎలాంటి ఉత్తర్వులు వెలువరించకూడదని పిటిషన్‌లో పేర్కొంది. స్పీకర్‌ తరఫున కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ప్రముఖ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపించే అవకాశం ఉంది. స్పీకర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని