విమర్శలకు చెక్‌ పెట్టే ప్రయత్నంలో దీదీ..

తాజా వార్తలు

Published : 23/03/2021 01:20 IST

విమర్శలకు చెక్‌ పెట్టే ప్రయత్నంలో దీదీ..

నందిగ్రామ్‌లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్న మమత

నందిగ్రామ్‌: పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో రెండు ఇళ్లను అద్దెకు తీసుకున్నారు. నందిగ్రామ్‌లోని రెయ్‌పారా ప్రాంతంలో ఈ గృహాలు ఉన్నాయి. ఏడాది కోసం ఓ ఇంటిని, ఆర్నెల్ల కోసం మరో ఇంటిని ఆమె అద్దెకు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ రెండు ఇళ్ల మధ్య దూరం కేవలం 100 మీటర్లు మాత్రమే ఉంది.

మమతా బెనర్జీ బయట నుంచి వచ్చిన వ్యక్తి అంటూ భాజపా అభ్యర్థి సువేందు అధికారి పదేపదే విమర్శలు చేస్తుండటంతో సీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నందిగ్రామ్‌లో శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకుంటానని, కొద్దిరోజుల క్రితం జరిగిన ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రకటించారు.
 Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని