AP Politics: సరిహద్దులో పంచాయితీలేంటి?: అచ్చెన్న

తాజా వార్తలు

Updated : 23/05/2021 12:26 IST

AP Politics: సరిహద్దులో పంచాయితీలేంటి?: అచ్చెన్న

విశాఖ: ఏపీ, తెలంగాణ సరిహద్దులో ప్రతిసారీ పంచాయితీలేంటని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. తెలంగాణలో ప్రత్యేక చట్టాలు ఏమైనా అమలవుతున్నాయా? దేశంలో ఆ రాష్ట్రం అంతర్భాగం కాదా? అని ప్రశ్నించారు. విశాఖలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్ర సరిహద్దులోని గుంటూరు జిల్లా పొందుగుల వద్ద పోలీసుల లాఠీఛార్జి చేస్తున్నారని అచ్చెన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. 

సరిహద్దులో ఇంత జరుగుతున్నా.. సీఎం జగన్‌కు ప్రజల బాగోగులు పట్టవా? అని నిలదీశారు. వైకాపాకు చెందిన మంత్రినో, ఎమ్మెల్యేనో ఆపితే జగన్‌ చూస్తూ ఊరుకుంటారా?అని ప్రశ్నించారు. జరుగుతున్నది చూస్తుంటే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందో? లేదో?అర్థం కావడం లేదని దుయ్యబట్టారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడకుండా ఇరు రాష్ట్రాల సీఎంలు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని అచ్చెన్నాయుడు సూచించారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని