డీపీఆర్‌లు ఇస్తే బండారం బయటకు..: బండి సంజయ్‌ 

తాజా వార్తలు

Updated : 20/01/2021 13:39 IST

డీపీఆర్‌లు ఇస్తే బండారం బయటకు..: బండి సంజయ్‌ 

హైదరాబాద్‌: కాళేశ్వరం పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఈ ప్రాజెక్టు కింద గత రెండేళ్లుగా ఒక్క ఎకరానికీ నీరు ఇవ్వకుండానే ఇస్తున్నట్లు అబద్ధాలు చెబుతున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ కాళేశ్వరం సందర్శన నేపథ్యంలో బండి సంజయ్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. కేంద్రానికి ఇచ్చిన డీపీఆర్‌లో కేవలం 17.50 లక్షల ఎకరాలే చూపించిన రాష్ట్ర ప్రభుత్వం కోటి ఎకరాలకు నీరందిస్తున్నట్లు చెబుతూ మోసం చేస్తోందన్నారు. కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వ శాఖ అడిగిన డీపీఆర్‌లు ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదని.. ప్రాజెక్టుకు సంబంధించి మూడో టీఎంసీ డీపీఆర్‌ ఇస్తే సీఎం బండారం బయటపడుతుందని వ్యాఖ్యానించారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎక్కడికైనా వచ్చి చర్చించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. సీఎం కేసీఆర్‌ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ప్రజల దృష్టిని మరల్చలేరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్‌ పూర్తిగా విఫలమైందని.. భవిష్యత్తులో ఈ ప్రాజెక్టు దర్శనీయ స్థలం అవుతుందే తప్ప ప్రజలకు ఏమాత్రం ఉపయోగపడదన్నారు. 

ఇవీ చదవండి..

TS: ప్రభుత్వం ముందు 14 డిమాండ్లు

గబ్బా కోటకు టీమ్‌ఇండియా బీటలుAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని