రాజధాని మారిస్తే చూస్తూ ఊరుకోం: పవన్‌
close

తాజా వార్తలు

Updated : 15/02/2020 14:16 IST

రాజధాని మారిస్తే చూస్తూ ఊరుకోం: పవన్‌

అమరావతి: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ శనివారం రాజధాని అమరావతి పరిధిలోని గ్రామాల్లో పర్యటించారు. కృష్ణాయపాలెం, ఎర్రబాలెంలో రైతుల దీక్షకు మద్దతు తెలిపి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వచ్చినట్టు రాలేదని, రైతులకు భరోసా ఇవ్వడానికే వచ్చానని తెలిపారు.

‘‘రాజధాని ఎక్కడ ఉండాలనేది ప్రభుత్వ నిర్ణయం. అయితే, గతంలోనే ఆ నిర్ణయం తీసకున్నారు. ఇప్పుడు రాజధాని మార్చే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. గత ప్రభుత్వం నిర్ణయించినప్పుడు.. వైకాపా కూడా అంగీకరించింది. ఇప్పుడు రాజధాని మారుస్తామంటే చూస్తూ ఊరుకోం. రాజధాని ఎక్కడికీ పోదని భరోసా ఇవ్వడానికే ఇక్కడికి వచ్చా. రైతులకు మద్దతుగా ర్యాలీ చేద్దామనుకున్నాం. దిల్లీ ఎన్నికల కారణంగా  అది వాయిదా వేశాం. త్వరలోనే ర్యాలీ నిర్వహిస్తాం. అమరావతి రైతులకు అండగా ఉంటామని భాజపా పెద్దలు చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో రైతులకు అన్యాయం జరగదు. ఎవరు వచ్చినా రాకున్నా నేను..మీకు అండగా ఉంటా’’ అని పవన్‌ కల్యాణ్ స్పష్టం చేశారు.

 Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని