తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ

తాజా వార్తలు

Published : 21/04/2020 23:24 IST

తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణఅమరావతి : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలం కునికినపాడులో తెదేపా-వైకాపా వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. ఈ గొడవలో పదిమందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నందిగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ప్రజలకు నిత్యావసర సరుకుల పంపిణీ చేసే విషయంలోనే ఈ ఘర్షణ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. చంద్రబాబు పుట్టినరోజు సందర్భంగా స్థానిక తెదేపా నేతలు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అయితే ఇవాళే వైకాపా నేతలు కూడా సరుకులు పంపిణీ చేయడంతో ఇరు వర్గాల మధ్య వివాదం చెలరేగడానికి కారణమైనట్లు సమాచారం. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని