చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం

తాజా వార్తలు

Updated : 28/08/2020 15:25 IST

చిత్తూరు జిల్లాలో తెదేపా నేతల గృహనిర్బంధం

తిరుపతి: చిత్తూరు జిల్లాలో తెదేపా నేతలను  పోలీసులు గృహనిర్బంధంలో ఉంచారు. ఓం ప్రతాప్‌ కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న నేతలను పోలీసులకు ఎక్కడికక్కడ కట్టడి చేస్తున్నారు. పుంగనూరు నియోజకవర్గం పరిధిలోని సోమలలో మూడు రోజుల క్రితం ఓంప్రతాప్‌ అనే ఎస్సీ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. 

ఆత్మహత్యకు రెండ్రోజుల ముందు ప్రభుత్వ మద్యం విధానాన్ని విమర్శిస్తూ, సీఎంను దూషిస్తూ సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడు. ఆ తర్వాత కొద్ది రోజులకే యువకుడు ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెదేపా నేతలు ఎస్సీ కాలనీకి వెళ్లి బాధిత కుటుంబాన్ని పరామర్శించడంతో పాటు, గ్రామస్థుల నుంచి పూర్తి వివరాలు తెలుసుకుని ఘటనను వెలుగులోకి తీసుకురావాలని తెదేపా నేతలు భావించారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉదయం సోమల బయల్దేరేందుకు సమాయత్తమైన తెదేపా నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. చిత్తూరులో జిల్లా తెదేపా అధ్యక్షుడు పులివర్తి నానిని, పలమనేరులో మాజీ మంత్రి అమర్నాథ్‌రెడ్డిలను గృహనిర్భంధంలో చేశారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని