పథకం ప్రకారమే ఎమ్మెల్యేపై దాడి: హరీశ్‌రావు

తాజా వార్తలు

Published : 03/11/2020 00:55 IST

పథకం ప్రకారమే ఎమ్మెల్యేపై దాడి: హరీశ్‌రావు

దుబ్బాక: ఆందోలు ఎమ్మెల్యే క్రాంతికిరణ్‌పై భాజపా కార్యకర్తల దాడి హేయమైన చర్య అని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నట్లు మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ఒక దళిత ఎమ్మెల్యేపై భౌతికదాడికి దిగడం శోచనీయమన్నారు. పథకం ప్రకారమే భాజపా కార్యకర్తలు దాడికి పాల్పడ్డారని హరీశ్‌రావు ఆరోపించారు. దుబ్బాక ఉప ఎన్నిక మంగళవారం జరగనుంది. ఈ నేపథ్యంలో సిద్దిపేటలో క్రాంతికిరణ్‌ బస చేసిన హోటల్‌లోకి భాజపా కార్యకర్తలు దూసుకెళ్లారు. దీంతో తెరాస, భాజపా వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనపై హరీశ్‌రావు మాట్లాడుతూ.. ‘‘దుబ్బాక ఉప ఎన్నిక భాజపా ఇన్‌ఛార్జి జితేందర్‌రెడ్డి జిల్లాలోనే ఉంటే తప్పుకాదా? ఎమ్మెల్యే క్రాంతి కిరణ్‌ సిద్దిపేటలో ఉంటే తప్పేంటీ? భాజపా నేతలు శాంతి భద్రతలు దెబ్బతీయాలని చూస్తున్నారు. భాజపా కార్యకర్తల దాడికి ముందు పోలీసులు తనిఖీ చేసి వెళ్లారు. పోలీసుల తనిఖీల్లో ఎలాంటి ప్రచార సామగ్రి లభించలేదు’’ అని పేర్కొన్నారు.  
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని