సంపూర్ణ లాక్‌డౌన్‌తోనే కొవిడ్‌కు అడ్డుకట్ట
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

సంపూర్ణ లాక్‌డౌన్‌తోనే కొవిడ్‌కు అడ్డుకట్ట

ఏపీ ప్రభుత్వానికి చంద్రబాబు సూచన

ఈనాడు, అమరావతి: ఏపీలో తక్షణమే సంపూర్ణ లాక్‌డౌన్‌ విధించి కరోనా వ్యాప్తిని అడ్డుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని తెదేపా అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. 18-45 ఏళ్ల మధ్య వారందరికీ యుద్ధ ప్రాతిపదికన టీకాలు వేయాలని సూచించారు.  ‘కేరళ, కర్ణాటకలు కోటి చొప్పున, తమిళనాడు 1.5 కోట్ల డోస్‌ల టీకాల కోసం ఆర్డర్‌ పెడితే, ఏపీ ప్రభుత్వం కేవలం 13.30 లక్షల డోస్‌లకే ఆర్డర్‌ చేసింది. రూ.45 కోట్లే కేటాయించి అందరికీ టీకా వేసేస్తామన్నట్టు మాట్లాడటమేమిటి...’ అని ఆయన ప్రశ్నించారు. కరోనా ప్రభావం, నియంత్రణ చర్యలపై చర్చించేందుకు బుధవారం చంద్రబాబు అధ్యక్షతన తెదేపా పొలిట్‌బ్యూరో అత్యవసర సమావేశాన్ని ఆన్‌లైన్‌లో నిర్వహించి అనంతరం విలేకరులతో మాట్లాడారు. ‘కరోనా సెకండ్‌వేవ్‌ బీభత్సంలో కుటుంబాలకు కుటుంబాలే తుడిచిపెట్టుకుపోతుంటే ప్రభుత్వం బాధ్యతారహితంగా వ్యవహరిస్తోంది. మంగళవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో కొవిడ్‌ నియంత్రణను 33వ అంశంగా పెట్టుకోవడమే దీనికి నిదర్శనం. కొత్త స్ట్రెయిన్‌ ఎన్‌440కే కర్నూలులో బయటపడి దేశమంతా వ్యాపిస్తోంది. ఇదివరకు వ్యాపించిన స్ట్రెయిన్‌ల కన్నా అది 10-15 రెట్లు ఎక్కువ ప్రమాదకరమని శాస్త్రవేత్తలు, జాతీయ మీడియా ఘోషిస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం కొత్త స్ట్రెయినే లేదని, రాష్ట్రంలో పడకలకు, వెంటిలేటర్లకు కొరతే లేదని బుకాయిస్తోంది. కరోనా నియంత్రణపై ముఖ్యమంత్రే స్వయంగా సమీక్షించాలి’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు