దాడులు ఆగకపోతే పశ్చిమబెంగాల్‌లో కరసేవ
close

ప్రధానాంశాలు

Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

దాడులు ఆగకపోతే పశ్చిమబెంగాల్‌లో కరసేవ

నిరసన దీక్షలో బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: పశ్చిమబెంగాల్‌లో ఓ ప్రణాళిక ప్రకారమే భాజపా కార్యకర్తలపై దమనకాండ సాగుతోందని, తమ పార్టీ సహనాన్ని తృణమూల్‌ కాంగ్రెస్‌ పిరికితనంగా భావిస్తోందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. ఆ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేకుండా చేస్తున్నారంటూ మమతాబెనర్జీపై ఆయన ధ్వజమెత్తారు. తమ పార్టీ కార్యకర్తలపై తృణమూల్‌ కాంగ్రెస్‌ శ్రేణుల దాడుల్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో భాగంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ బుధవారం దీక్ష చేశారు. పార్టీ శ్రేణుల్ని కాపాడుకునేందుకు దేశంలోని భాజపా కార్యకర్తలు పశ్చిమబెంగాల్‌ వెళ్లి  కరసేవ చేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ హెచ్చరించారు. విదేశీ నిధులతోనే తృణమూల్‌ కాంగ్రెస్‌ విజయం సాధించిందని ఆరోపించారు. బెంగాల్‌లో తృణమూల్‌ దాడులపై లౌకికవాదులు ఎందుకు స్పందించట్లేదని ఆయన ప్రశ్నించారు. రోహింగ్యాలకు పశ్చిమబెంగాల్‌ అడ్డాగా మారిందన్నారు. దీక్షలో భాజపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు మనోహర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి డాక్టర్‌ ప్రకాశ్‌రెడ్డి, ఎస్సీ మోర్చా జాతీయకార్యదర్శి ఎస్‌.కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని
రుచులు