కారాగారం నుంచి మాజీ మంత్రి ఉమా విడుదల

ప్రధానాంశాలు

కారాగారం నుంచి మాజీ మంత్రి ఉమా విడుదల

రాజమహేంద్రవరం నేరవార్తలు న్యూస్‌టుడే: ఏపీలో రూల్‌ ఆఫ్‌ లా అనేది లేదని, చట్టాన్ని పూర్తిగా దుర్వినియోగం చేస్తూ అడ్డగోలుగా వ్యవహరిస్తూ పరిపాలన సాగిస్తున్నారని మాజీ మంత్రి, తెదేపా నేత దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. రాజమహేంద్రవరం కేంద్ర కారాగారంలో ఉన్న ఆయన బెయిల్‌ రావడంతో గురువారం మధ్యాహ్నం 1.30కి విడుదలయ్యారు. జైలు దగ్గర విలేకరుల సమావేశంలో మాట్లాడారు. మైనింగ్‌ అక్రమాలను చూపించడానికి తాను కొండపల్లి అటవీ ప్రాంతానికి వెళ్లినప్పుడు... కారులో ఉన్న తనపై పోలీసుల సమక్షంలోనే దాడి జరిగిందని, గూండాలు కారు ముందు అద్దాలు పగలగొడితే, పోలీసులు పక్క అద్దాలు పగలగొట్టారని చెప్పారు.  6 గంటలపాటు తాను కారులోనే ఉన్నానని, తనను అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో అరెస్టు చేసి 14 గంటలపాటు రెండు పోలీసు స్టేషన్లకు తిప్పారని, తప్పుడు కేసులుపెట్టి మర్నాడు రాత్రికి రాజమహేంద్రవరం కేంద్ర కారాగారానికి తీసుకువచ్చారన్నారు.


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని