AP News: అమిత్‌షాను ఆ పదంతో సంబోధించి.. చొక్కా నలగకుండా రాగలరా?

ప్రధానాంశాలు

AP News: అమిత్‌షాను ఆ పదంతో సంబోధించి.. చొక్కా నలగకుండా రాగలరా?

చంద్రబాబుకు ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల సవాల్‌

ఈనాడు, అమరావతి: ‘ఏపీ ముఖ్యమంత్రిని మీరు తిట్టించిన పదం బూతు కాకపోతే.. దానికి అర్థం బాగున్నారా అనే అయితే.. రేపు దిల్లీ వెళ్లినపుడు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను అదే పదంతో సంబోధించి, మీ చొక్కా నలగకుండా బయటకు రాగలరా?’ అని చంద్రబాబును ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. ‘చొక్కా నలగకుండా బయటకొస్తే... ఆ పదాన్ని మేమే తప్పుగా అర్థం చేసుకున్నామని క్షమాపణ చెబుతాం. లేకపోతే అది బూతేనని, తప్పు చేశామని సీఎంకు మీరు క్షమాపణ చెప్పాలి. అందుకు సిద్ధమా?’ అని సవాల్‌ చేశారు. వైకాపా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం రాత్రి విలేకరులతో సజ్జల మాట్లాడారు. ‘క్రానిక్‌ డయాబెటిక్‌ పేషెంట్‌ 70 ఏళ్లకు పైగా వయసులో 36 గంటలు నిరాహార దీక్ష చేశారట. దీక్ష పూర్తయ్యాక గంటన్నరపాటు ఊగిపోతూ ప్రసంగించారు. అన్ని గంటల నిరాహార దీక్ష చేస్తే నీరసం రాదా? ఆ దీక్షో ఫార్స్‌. చంద్రబాబు దిల్లీకి వెళతామనడంపై సజ్జల స్పందిస్తూ... ‘ఈ వంకతో దిల్లీ వెళ్లి ఫ్రంట్‌ ఏర్పాటు ప్రయత్నం చేస్తారేమో? చంద్రబాబు చెప్పిందే కాకుండా రెండోవైపు ఏం జరిగిందనేదీ అడగాలని ఆ పార్టీలను కోరుతున్నాం. చంద్రబాబు రాష్ట్రపతికి తప్పుడు సమాచారం ఇవ్వకుండా అంతకంటే ముందుగానే వాస్తవ సమాచారాన్ని పంపే ప్రయత్నం చేస్తాం. ఈసీని మా ఎంపీలు కలిసి తెదేపా గుర్తింపు రద్దు చేయాలని కోరతారు’ అని తెలిపారు.

Advertisement


Tags :

ప్రధానాంశాలు

జిల్లా వార్తలు

దేవతార్చన


మరిన్ని