close
Array ( ) 1

తాజా వార్తలు

క్రైస్ట్‌చర్చ్‌లో ఓడిపోతే అంతే సంగతి!

గెలవాలనే పట్టుదలతో ‘కోహ్లీ’సేన

క్రైస్ట్‌చర్చ: న్యూజిలాండ్‌తో శనివారం నుంచి ప్రారంభమయ్యే రెండో టెస్టులో విజయం సాధించాలని టీమ్‌ఇండియా ఎంతో పట్టుదలతో ఉంది. మరీ ముఖ్యంగా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీకి ఈ గెలుపు ఎంతో అవసరం. విదేశాల్లో అత్యధిక టెస్టు ఓటముల టీమ్‌ఇండియా కెప్టెన్ల జాబితాలో మరింత దిగజారకుండా ఉండాలంటే తప్పక గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. కోహ్లీ జట్టు బాధ్యతలు చేపట్టాక టీమ్‌ఇండియా.. ఓవర్సీస్‌లో మొత్తం 15 మ్యాచ్‌లు ఆడింది‌. అందులో 9 టెస్టులు ఓడిపోగా 4 మాత్రమే గెలిచింది. మిగతా రండు డ్రా అయ్యాయి. దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్‌, న్యూజిలాండ్‌ ఆస్ట్రేలియాలో పర్యటించిన కోహ్లీసేన ఎప్పుడూ అన్ని టెస్టులు ఓడిపోలేదు. సిరీస్‌లో కనీసం ఒక్క మ్యాచైనా గెలుపొందింది. తాజా కివీస్‌ పర్యటనలో రెండు టెస్టులే ఉండగా న్యూజిలాండ్‌ ఇప్పటికే తొలి మ్యాచ్‌ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడు రెండో టెస్టులో గెలవకపోతే.. కోహ్లీ కెప్టెన్సీ ఖాతాలో అనవసరపు రికార్డు నమోదవుతుంది. 

మహేంద్రసింగ్‌ ధోనీ కెప్టెన్‌గా ఉన్నప్పుడు టీమ్‌ఇండియా విదేశాల్లో అత్యధికంగా 15 టెస్టులు ఓడిపోయింది. దీంతో ఈ జాబితాలో అతడు అగ్రస్థానంలో ఉన్నాడు. ధోనీ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, విరాట్‌ కోహ్లీ చెరో 10 ఓటములతో రెండో స్థానంలో నిలిచారు. ఒకవేళ భారత్‌ క్రైస్ట్‌చర్చ్‌లో గనక ఓటమిపాలైతే.. గంగూలీని అధిగమించి కోహ్లీ 11 ఓటములతో రెండో స్థానంలో కొనసాగుతాడు. అలా జరగకూడదంటే కోహ్లీసేన రెండో టెస్టులో తప్పక గెలవాల్సి ఉంది. కాగా, టీమ్‌ఇండియా కెప్టెన్‌ ప్రస్తుతం ఫామ్‌లో లేక సతమతమవుతున్న సంగతి తెలిసిందే. గత టెస్టులో 21 పరుగులే చేసిన అతడు తర్వాతి మ్యాచ్‌లో ఎలా రాణిస్తాడో చూడాలి. అలాగే మిగతా బ్యాట్స్‌మెన్‌ సైతం రెండో టెస్టులో పుంజుకోవాల్సిన అవసరముంది. లేదంటే.. భారత్‌ ఘోర పరాభావాన్ని మూటగట్టుకోవాల్సి ఉంటుంది. 


Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.