close
Array ( [0] => stdClass Object ( [video_news_id] => 120044359 [video_srlno] => 1 [video_type] => 3 [video_link] => 1245420585414299649 [video_short_link] => 1245420585414299649 [created_by] => 9030378 [created_date] => 2020-04-02 10:18:37.212804 [modified_by] => [modified_date] => [display_status] => 1 [video_isdeleted] => ) ) 1

తాజా వార్తలు

భారత్‌ మళ్లీ ఎప్పుడు గెలుస్తుందో..

రెండోసారి విశ్వవిజేతగా నిలిచిన టీమ్‌ఇండియా
ప్రపంచకప్‌ అందించిన ధోనీ, గౌతమ్‌ గంభీర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: టీమ్‌ఇండియా రెండోసారి విశ్వవిజేతగా నిలిచి తొమ్మిదేళ్లు గడిచాయి. వాంఖడే వేదికగా 2011 ఏప్రిల్‌ 2న నాటి సారథి మహేంద్ర సింగ్‌ ధోనీ ప్రపంచకప్‌ ఫైనల్లో శ్రీలంకపై కొట్టిన సిక్స్‌ ఇప్పటికీ అభిమానుల కళ్లల్లో కదలాడుతూనే ఉంది. ఆ సిక్స్‌తో క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ తెందూల్కర్‌ చిరకాల కోరిక నెరవేరింది. తర్వాత రెండు వన్డే ప్రపంచకప్‌లు జరిగినా టీమ్‌ఇండియా సెమీస్‌ నుంచే నిష్క్రమించాల్సి వచ్చింది. మళ్లీ ఎప్పుడు విశ్వవిజేతగా నిలుస్తుందనే ఆశతో కోట్లాది మంది అభిమానులు ఎదురుచూస్తున్నారు. కపిల్‌, ధోనీ తర్వాత టీమ్‌ఇండియాకు మరో ప్రపంచకప్‌ అందించే సారథి ఎవరో కాలమే నిర్ణయించాలి. 2011 ప్రపంచకప్‌ ఫైనల్‌ జరిగి నేటికి తొమ్మిది వసంతాలు పూర్తైన సందర్భంగా నాటి విశేషాలు మీకోసం..


జయవర్ధనే పోరాడినా.. 

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న శ్రీలంకకు జయవర్ధనే(103; 88 బంతుల్లో 13x4) అజేయ శతకంతో ఆదుకున్నాడు. ఓపెనర్‌ ఉపుల్‌ తరంగ(2) ఆదిలోనే జహీర్‌ బౌలింగ్‌లో ఔటయ్యాడు. వన్‌డౌన్‌లో వచ్చిన కెప్టెన్‌ సంగక్కర్‌(48), దిల్షాన్‌(33)తో కలిసి బాధ్యతాయుతంగా ఆడాడు. వీరిద్దరూ 43 పరుగుల భాగస్వామ్యం జోడించాక దిల్షాన్‌ భజ్జీ బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం జయవర్ధనే, సంగక్కర.. భారత బౌలర్లపై చెలరేగుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. జట్టు స్కోర్‌ 122 పరుగుల వద్ద యువీ బౌలింగ్‌లో సంగక్కర అర్ధ శతకానికి చేరువలో ధోనీ చేతికి చిక్కి పెవిలియన్‌ చేరాడు. అనంతరం సమరవీర(21), కపుగెదెర(1) కులశేఖర(32) జయవర్ధనేతో కలిసి ఆదుకునే ప్రయత్నం చేసినా భారీ ఇన్నింగ్స్‌ ఆడలేకపోయారు చివరికి పెరీరా(22) సాయంతో జయవర్ధనే జట్టుకు మంచి స్కోర్‌ అందించాడు. భారత బౌలర్లలో యువీ, జహీర్‌ రెండేసి వికెట్లు తీయగా, హర్భజన్‌ ఒక వికెట్‌ పడగొట్టాడు.


ఆదిలోనే షాక్‌.. ఆదుకున్న గంభీర్‌, ధోనీ

275 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన టీమ్‌ఇండియాను.. లసిత్‌ మలింగా ఆదిలోనే దెబ్బతీశాడు. ఇన్నింగ్స్‌ ఆరంభమైన రెండో బంతికే సెహ్వాగ్‌(0)ను డకౌట్‌గా పెవిలియన్‌ పంపిన అతడు కొద్దిసేపటికే సచిన్‌ తెందూల్కర్‌(18)ను సైతం ఔట్‌ చేశాడు. దీంతో భారత్‌ 31 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో వన్‌డౌన్‌ బ్యాట్స్‌మన్‌ గౌతమ్‌ గంభీర్‌ ‌(97; 122 బంతుల్లో 9x4) నేనున్నానంటూ ఆదుకున్నాడు. విరాట్‌ కోహ్లీ(35)తో కలిసి కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 83 పరుగులు జోడించాక కోహ్లీ.. దిల్షాన్‌ బౌలింగ్‌లో రిటర్న్‌ క్యాచ్‌ ఇచ్చి వెనుతిరిగాడు. తర్వాత ధోనీ(91; 79 బంతుల్లో 8x4, 2x6) గంభీర్‌తో కలిసి శతకం భాగస్వామ్యం నిర్మించాడు. ఈ క్రమంలో శతకానికి చేరువైన గంభీర్‌ పెరీరా బౌలింగ్‌లో బౌల్డయ్యాడు. అనంతరం యువీ(21; 24 బంతుల్లో 2x4)తో కలిసిన ధోనీ టీమ్‌ఇండియాను విజయ పథంలో నడిపించాడు. కులశేఖర వేసిన 48.2 ఓవర్‌కు భారీ సిక్స్‌ కొట్టి ఎప్పటికీ గుర్తుండిపోయే విజయాన్ని అందించాడు. 

 

 



Tags :

స్పోర్ట్స్

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

బిజినెస్‌

జాతీయ-అంతర్జాతీయ

జిల్లా వార్తలు

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact : 9000180611, 040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.