గ్రౌండ్‌లో ప్రపోజ్‌.. గర్ల్‌ఫ్రెండ్‌ సర్‌ప్రైజ్‌ 

తాజా వార్తలు

Published : 06/07/2021 01:05 IST

గ్రౌండ్‌లో ప్రపోజ్‌.. గర్ల్‌ఫ్రెండ్‌ సర్‌ప్రైజ్‌ 

వీడియో పంచుకున్న ఫుట్‌బాల్‌ క్లబ్‌

(Photo: Minnesota United FC Twitter)

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికన్‌ ఫుట్‌బాల్‌ ప్లేయర్‌ ఒకరు తన ప్రేయసికి మైదానంలోనే ప్రపోజ్‌ చేశాడు. ప్రేక్షకులు కేరింతలు కొడుతుండగా మోకాలిపై కూర్చొని నన్ను పెళ్లి చేసుకుంటావా అని ఎంతో ప్రేమతో అడిగాడు. దానికి ఫిదా అయిన ఆ యువతి మరోక్షణం ఆలోచించకుండా సరేనని అంగీకరించింది. దాంతో ఇద్దరు హత్తుకొని భావోద్వేగానికి గురయ్యారు. ఈ ఘటన అమెరికాలోని మేజర్‌ లీగ్‌ సాకర్‌ ఈవెంట్‌లో తాజాగా చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. మిన్నెసొటా ఫుట్‌బాల్‌ క్లబ్‌ ఆటగాడు హస్సాని డాట్‌సన్‌ ఆదివారం సాన్‌జోస్‌ టీమ్‌తో తలపడిన తర్వాత మైదానంలోనే తన ప్రేయసికి ప్రపోజ్‌ చేశాడు. మ్యాచ్‌ను తిలకించడానికి వచ్చిన వారికి ఆట ముగిశాక ఇదో కనులవిందుగా అనిపించింది.

డాట్‌సన్‌, అతడి ప్రేయసి పెట్రావికోవిచ్‌ కొద్దిరోజులుగా డేటింగ్‌లో ఉన్నారు. ఈ క్రమంలోనే ఆదివారం మ్యాచ్‌ పూర్తయ్యాక పెళ్లి చేసుకోమని ఆమెను అడిగాడు. పెట్రా కూడా అంగీకరించడంతో వారి ఆనందానికి అవధుల్లేకుండాపోయాయి. వారిద్దరూ ఆ అరుదైన సంఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. ఈ సందర్భంగా పెట్రా భావోద్వేగానికి గురైంది. ‘ఇప్పుడు నా హృదయం అనుభవించే ఈ సంతోషాన్ని వ్యక్త పర్చడానికి మాటలు లేవు. హస్సాని.. నీ నుంచి ప్రేమ పొందడం నా అదృష్టం. అలాగే మాకు శుభాకాంక్షలు చెప్పిన వారికి, ఈ మధుర జ్ఞాపకాన్ని నా జీవితంలోకి తీసుకురావడానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ పెద్ద థ్యాంక్స్‌’ అని ఆమె పోస్టు చేసింది. ఈ వీడియోకు నెటిజెన్లు సైతం ఫిదా అయ్యారు. వేలాది మంది లైకులు కొడుతూ ఈ జంటకు శుభాకాంక్షలు చెబుతున్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని