
తాజా వార్తలు
ఆరో వికెట్ కోల్పోయిన ఆసీస్
ఇంటర్నెట్‌డెస్క్: గబ్బా మైదానంలో టీమిండియాతో జరుగుతున్న నిర్ణయాత్మక ఆఖరి టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆరో వికెట్ కోల్పోయింది. క్రీజులో కుదురుకున్న గ్రీన్ (37)ను శార్దూల్ ఠాకూర్ చక్కని బంతితో పెవిలియన్‌కు చేర్చాడు. బంతిని అంచనా వేయడంలో విఫలమైన గ్రీన్ స్లిప్‌లో ఉన్న రోహిత్ చేతికి చిక్కాడు. ప్రస్తుతం క్రీజులో పైన్ (16), కమిన్స్ (2) ఉన్నారు. ఆస్ట్రేలియా ఆరు వికెట్ల నష్టానికి 231 పరుగులు చేసింది. టీమిండియా కంటే 263 పరుగుల ఆధిక్యంలో ఉంది.
ఇదీ చదవండి
స్మిత్ ఔట్: ఆసీస్ ఆధిక్యం 229
Tags :