Tokyo Olympics: స్వర్ణ పతకాన్ని తీసుకెళ్లేందుకు సంచి తయారు చేసుకున్న క్రీడాకారుడు

తాజా వార్తలు

Updated : 02/08/2021 20:24 IST

Tokyo Olympics: స్వర్ణ పతకాన్ని తీసుకెళ్లేందుకు సంచి తయారు చేసుకున్న క్రీడాకారుడు

టోక్యో: అతడు అత్యుత్తమ క్రీడాకారుడే కాదు.. కుట్లు, అల్లికల్లోనూ తన ప్రతిభను కనబరుస్తూ ఆకట్టుకుంటాడు. సమయం చిక్కినప్పుడల్లా తనకు కావాల్సిన వస్తువులను తానే అల్లుకుంటారు. టోక్యో ఒలింపిక్స్‌లో సాధించిన బంగారు పతకాన్ని తీసుకెళ్లేందుకు కూడా అందమైన చిన్న సంచిని తయారు చేసుకున్నాడు. అతడే బ్రిటన్‌కు చెందిన డైవర్‌ టామ్‌ దాలే (27). టోక్యో ఒలింపిక్స్‌లో తన వస్తువులను తానే కుట్టుకుంటూ పలుమార్లు కెమెరా కంటికి చిక్కాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి.

టోక్యో ఒలింపిక్స్‌లో గతవారం జరిగిన 10 మీటర్ల డైవింగ్‌లో టామ్‌ దాలే స్వర్ణం సాధించాడు. కాగా ఆదివారం జరిగిన మహిళల 3 మీటర్ల స్ప్రింగ్‌బోర్డ్‌ పోటీలకు అతడు హాజరయ్యాడు. స్టాండ్స్‌లో కూర్చొని అందరూ ఆ పోటీలను ఆసక్తిగా తిలకిస్తుంటే.. టామ్‌ మాత్రం అల్లికల్లో నిమగ్నమయ్యాడు. నిత్యం టోపీలను ధరించే టామ్‌.. రెండు సూదులతో పర్పుల్‌ టోపీని అల్లుకుంటూ కెమెరాలకు చిక్కాడు. ఆ ఫొటోలను ఒలింపిక్స్‌ అధికారిక ట్విటర్‌ ఖాతాలో పోస్టు చేయగా ఇప్పటికే 1.65 లక్షల మంది లైక్‌ చేశారు. బ్రిటన్‌ జాతీయ జెండాతోపాటు, ఒలింపిక్స్‌ రింగులను అల్లుతూ సోమవారం మరోసారి కెమెరాకు చిక్కాడు.

కుట్లు, అల్లికల్లో తన ప్రతిభను కనబరుస్తూ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు చేస్తుంటాడు టామ్‌ దాలే. అతడికి 4.2 లక్షల మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన సందర్భంగా ఇన్‌స్టాలో ఆనందం వ్యక్తం చేశాడు. కుట్లు, అల్లికల సమయంలో మనసు ఎంతో ప్రశాంతంగా ఉంటుందని తెలిపాడు. ‘ఈ ఒలింపిక్స్‌లో కుట్లు, అల్లికలు నాకు ఎంతగానో ఉపయోగపడ్డాయి. నేను స్వర్ణం సాధించాం. నా స్వర్ణాన్ని తీసుకెళ్లేందుకు ఓ పౌచ్‌ను కూడా తయారు చేసుకున్నా’ అని పేర్కొన్నాడు. టామ్‌ దాలేకు ఇదే చివరి ఒలింపిక్స్‌. లండన్‌, రియో విశ్వక్రీడల్లో అతడు కాంస్య పతకాలు సాధించాడు. 13 ఏళ్ల నిరీక్షణ అనంతరం అతడికి టోక్యోలో స్వర్ణం దక్కింది.





Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని