close

తాజా వార్తలు

Updated : 07/04/2021 18:48 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఐపీఎల్‌: కుర్రాళ్లు కుమ్మేశారు..!

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్‌) ఎంతో మంది యువక్రికెటర్ల భవిష్యత్‌ను మార్చేసింది. సూర్యకుమార్ యాదవ్‌,ఇషాన్‌ కిషన్, రిషభ్ పంత్, శ్రేయస్‌ అయ్యర్ లాంటి ఆటగాళ్లకు టీమిండియాలో అవకాశం దక్కేందుకు వేదికగా నిలిచింది. ఆ ఆటగాళ్ల గురించి ఓ సారి తెలుసుకుందాం.

 పరాగ్‌.. పంచ్

అది 2019 ఐపీఎల్‌లో 53 మ్యాచ్. దిల్లీ క్యాపిటల్స్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్‌ చేసిన రాజస్థాన్‌ 5.2 ఓవర్లలో 30 పరుగులు మాత్రమే చేసి 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఇలాంటి స్థితిలో ఇంకా 18 ఏళ్లు కూడా నిండని రియాన్ పరాగ్ క్రీజులోకి వచ్చాడు. తొలుత నిలకడగా ఆడిన పరాగ్ తర్వాత గేర్‌ మార్చాడు. వికెట్లు పడుతున్నా ఒత్తిడికి గురికాకుండా ఎడాపెడా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదిలించాడు. ఇషాంత్‌ శర్మ వేసిన ఓవర్లో ఫోర్‌, సిక్స్, ట్రెంట్‌ బోల్ట్‌ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు బాది ఐపీఎల్‌లో తన తొలి అర్ధసెంచరీని పూర్తి చేసుకున్నాడు. అప్పటికి పరాగ్‌ వయసు 17 ఏళ్ల 175 రోజులు మాత్రమే. ఐపీఎల్‌లో పిన్న వయసులో అర్ధసెంచరీ చేసిన రికార్డు ఇప్పటికీ  పరాగ్‌  పేరిటే ఉంది.

శభాష్..శాంసన్‌

టీనేజ్‌లో ఐపీఎల్ ఆడిన మొదటి క్రికెటర్ సంజు శాంసనే. దేశవాళీ టోర్నీల్లో రాణించి అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ క్రికెటర్‌ని 2012లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ తమ జట్టులోకి  తీసుకుంది. కాని ఆ సంవత్సరం సంజూకు ఆడే అవకాశం రాలేదు. 2013లో రాజస్థాన్‌ రాయల్స్‌ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేశాడు. తర్వాత సీజన్లో పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో సంజూ.. కేవలం 32 బంతుల్లో 50 పరుగులు చేసి ఐపీఎల్‌లో తన తొలి అర్ధ సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో శాంసన్‌ మూడు ఫోర్లు, నాలుగు సిక్స్‌లు బాది 52 పరుగులు చేశాడు. అప్పటికి శాంసన్‌ వయసు 18 ఏళ్ల 169 రోజులు మాత్రమే. ఈ రికార్డును రియాన్ పరాగ్ వయసు (17 ఏళ్ల 175 రోజులు) 2019లో బద్దలు కొట్టాడు.

పృథ్వీ షా.. సూపర్‌ షో

2018లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌, దిల్లీ డేర్‌డేవిల్స్‌ (ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌) మధ్య జరిగిన మ్యాచ్‌లో పృథ్వీ షా అద్భుత ప్రదర్శన చేశాడు. ఆడుతున్నది రెండో మ్యాచే అయినా.. సునీల్‌ నరైన్‌, మిచెల్‌ జాన్సన్‌, పీయూష్ చావ్లా బౌలింగ్‌కు బెదరకుండా ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 38 బంతుల్లో 50 పరుగులు చేసి ఐపీఎల్‌లో తన తొలి హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో షా 62 పరుగులు చేసి వెనుదిరిగాడు. అప్పటికి పృథ్వీ వయసు 18 ఏళ్ల 169 రోజులు మాత్రమే.

పంత్‌..పవర్‌ హిట్టింగ్

2016 సీజన్‌లో గుజరాత్ లయన్స్, దిల్లీ డేర్‌డేవిల్స్‌(ప్రస్తుతం దిల్లీ క్యాపిటల్స్‌) మధ్య జట్ల లీగ్‌ మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌ రిషభ్ పంత్‌కు మూడోది. డికాక్, పంత్‌ ఓపెనర్లుగా వచ్చారు. క్రీజులోకి వచ్చిరావడంతోనే ధాటిగా ఆడటం మొదలుపెట్టిన పంత్‌..ధవల్‌ కులకర్ణి వేసిన రెండో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టాడు. ఇలా డికాక్‌తో కలిసి ఎడాపెడా బౌండరీలు బాదిన పంత్.. సురేశ్‌ రైనా వేసిన 9 ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్సర్‌ బాది 25 బంతుల్లోనే ఐపీఎల్‌లో తొలి అర్ధ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. మొత్తం 40 బంతులాడిన రిషభ్.. 9 ఫోర్లు, 2 సిక్స్‌లు బాది 69 పరుగుల వద్ద రవీంద్ర జడేజా బౌలింగ్‌లో కీపర్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ మ్యాచ్‌ జరిగిన రోజు నాటికి పంత్ వయసు..18 ఏళ్ల 212 రోజులే.

ఇవీ చదవండి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని