IPL: ఐపీఎల్‌తో యూఏఈ పిచ్‌లు దెబ్బతింటాయ్‌ 

తాజా వార్తలు

Published : 05/07/2021 16:04 IST

IPL: ఐపీఎల్‌తో యూఏఈ పిచ్‌లు దెబ్బతింటాయ్‌ 

ప్రపంచకప్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారు: మార్క్‌ బౌచర్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: కరోనా కారణంగా అర్ధాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్‌ 14వ సీజన్‌ను సెప్టెంబర్‌-అక్టోబర్‌లో యూఏఈలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు అది పూర్తైన వెంటనే టీ20 ప్రపంచకప్‌ను కూడా అక్కడే నిర్వహిస్తున్నట్లు బీసీసీఐ తాజాగా స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్‌లో మిగిలిన మ్యాచ్‌లు నిర్వహించేసరికే అక్కడి పిచ్‌లు దెబ్బతింటాయని దక్షిణాఫ్రికా కోచ్‌ మార్క్‌ బౌచర్‌ ఆందోళన వ్యక్తం చేశాడు. బ్యాట్స్‌మెన్‌కు పరుగులు చేయడం ఇబ్బందిగా మారి స్పిన్నర్లకు కలిసివస్తుందని అతడు అభిప్రాయపడ్డాడు.

‘ఐపీఎల్‌ తర్వాత యూఏఈలోని పిచ్‌లు తేమ కోల్పోయి డ్రైగా తయారవుతాయి. దాంతో దక్షిణాఫ్రికాలో ఆడినట్లు ఇక్కడ బ్యాటింగ్‌ చేసి 180 లేదా 200 పరుగులు చేసే వీలుండదు. అలాంటి పరిస్థితుల్లో ఆడాలంటే ఎంతో నైపుణ్యం ఉండాలి. చాలా తెలివిగా ఆడాలి. బీసీసీఐ ఐపీఎల్‌ను యూఏఈలో నిర్వహించాలని నిర్ణయించింది. అక్కడ మైదానాలు ఎక్కువగా లేవు. దాంతో పిచ్‌లు దెబ్బతిని పనికిరాకుండా పోతాయి. ఈ క్రమంలోనే స్కోర్లు కూడా తక్కువగా నమోదవుతాయి. అప్పుడు బ్యాట్స్‌మెన్‌కు పరిస్థితులు కష్టంగా మారుతాయి’ అని బౌచర్‌ వివరించాడు. అలాగే ఐపీఎల్‌లో ఎలాంటి స్కోర్లు నమోదవుతాయో ఆ మ్యాచ్‌లను చూసి అంచనా వేయొచ్చని, ఆపై ప్రపంచకప్‌ ఆరంభ మ్యాచ్‌లను చూసి పిచ్‌లు ఎలా ప్రవర్తిస్తున్నాయో అర్థం చేసుకోవచ్చని అతడు చెప్పుకొచ్చాడు. చివరగా పొట్టి ప్రపంచకప్‌లో స్పిన్నర్లు కీలకపాత్ర పోషిస్తారని బౌచర్‌ వివరించాడు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని