టీమ్‌ ఇండియా లండన్‌ ప్రయాణం చూస్తారా!
close

తాజా వార్తలు

Updated : 04/06/2021 18:48 IST

టీమ్‌ ఇండియా లండన్‌ ప్రయాణం చూస్తారా!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇంగ్లాండ్‌ చేరుకున్న టీమ్‌ఇండియా కఠిన క్వారంటైన్‌లో ఉంటోంది. ఆటగాళ్లు ఒకర్నొకరు కలవకుండా తమ గదుల్లోనే ఉంటున్నారు. మూడు రోజుల తర్వాత క్రికెటర్లంతా కలుసుకొని సాధన చేయనున్నారు. కాగా క్రికెటర్ల ప్రయాణానికి సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్‌ మీడియాలో పంచుకొంది. ‘టీమ్ఇండియా ఇంగ్లాండ్‌ చేరుకోవడంతో ఉత్సాహం పెరిగింది’ అని దానికి వ్యాఖ్య పెట్టింది.

ఆటగాళ్లను ఒకర్నొకరు కలుసుకోవద్దని బీసీసీఐ తమకు చెప్పిందని అక్షర్‌ పటేల్‌ తెలిపాడు. ‘నాకు చక్కగా నిద్ర పట్టింది. ఇక మేం క్వారంటైన్లో ఉండాలి. మూడు రోజుల వరకు ఒకర్నొకరం కలుసుకోవద్దని మాకు చెప్పారు’ అని అతడు వీడియోలో చెప్పాడు.  ‘నిన్న రన్నింగ్‌ సెషన్‌ జరిగింది. ప్రయాణంలో సరిగ్గా నిద్రపట్టలేదు. శరీరం అలసిపోయింది’ అని మహ్మద్‌ సిరాజ్‌ చెప్పాడు. టీమ్‌ ఇండియా పురుషుల జట్టు, మహిళ జట్టు సందడిని ఈ వీడియోలో చూడొచ్చు. మహిళల జట్టు సభ్యులు సైతం క్వారంటైన్లో ఉంటారు. పది రోజులు ముగిశాక బ్రిస్టల్‌ బయల్దేరి వెళ్తారు. జూన్‌ 18న కోహ్లీసేన న్యూజిలాండ్‌తో టెస్టు ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో తలపడనున్న సంగతి తెలిసిందే. Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని