ప్యాంటులో దాచిపెట్టి పాముల అక్రమ రవాణాకు యత్నం

ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు.

Updated : 05 May 2024 08:21 IST

మయామీ విమానాశ్రయంలో చివరి నిమిషంలో భగ్నం చేసిన అధికారులు

మయామీ: ఫ్యాంటులో రహస్యంగా దాచిపెట్టి తరలిస్తున్న రెండు పాములను అమెరికాలోని మయామీ విమానాశ్రయంలో భద్రతా సిబ్బంది చివరి నిమిషంలో గుర్తించారు. ఈ మేరకు ట్రాన్స్‌పోర్ట్‌ సెక్యూరిటీ అడ్మినిస్ట్రేషన్‌ (టీఎస్‌ఏ) ట్విటర్‌లో ఓ పోస్టు ఉంచింది. గత నెల 26న ఓ ప్రయాణికుడిని తనిఖీ చేయగా అతని ఫ్యాంటులో ఉన్న ఓ చిన్నపాటి సంచిలో పాములను గుర్తించినట్లు వెల్లడించింది. చలువ కళ్లద్దాలు దాచుకునే సంచిలా ఉన్న ఓ సంచి, రెండు పాములు టీఎస్‌ఏ షేర్‌ చేసిన ఫొటోలో ఉన్నాయి. ప్రయాణికుడి నుంచి పాములను స్వాధీనం చేసుకున్నామని, అనంతరం వాటిని ఫ్లోరిడా మత్స్య, వన్యప్రాణి సంరక్షణ కమిషన్‌కు అప్పగించామని మయామీ అంతర్జాతీయ విమానాశ్రయ అధికారులు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని