WTC2: కొత్త పాయింట్ల విధానానికి ఆమోదం

తాజా వార్తలు

Published : 14/07/2021 16:11 IST

WTC2: కొత్త పాయింట్ల విధానానికి ఆమోదం

దుబాయ్‌: ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌-2 సరికొత్త విధానానికి ఐసీసీ ఆమోదముద్ర వేసింది. కొత్త పాయింట్ల పద్ధతిని ధ్రువీకరించింది. ఇకపై మ్యాచ్‌ గెలిస్తే 12, డ్రా అయితే 4, టై చేసుకుంటే 6 పాయింట్లు లభిస్తాయని తెలిపింది. ఇంగ్లాండ్‌, భారత్ ఐదు టెస్టుల సిరీసుతో రెండేళ్ల సైకిల్‌ మొదలవుతుంది.

గత ఛాంపియన్‌షిప్‌లో ఒక సిరీసుకు 120 పాయింట్లు కేటాయించారు. రెండు మ్యాచులే ఉంటే ఒక్కో మ్యాచుకు 60 వచ్చేవి. నాలుగు మ్యాచులుంటే కేవలం 30 పాయింట్లే లభించేవి. దాంతో పాటు కొవిడ్‌ కారణంగా మ్యాచులు జరగకపోవడంతో దీనిని మధ్యలోనే మార్చేశారు. పర్సంటేజీ విధానం తెచ్చారు. ఇందులో సమానత్వం లేదని, లోటుపాట్లు ఉన్నాయని విమర్శలు వచ్చాయి. దాంతో ఐసీసీ కొత్త విధానాన్ని తీసుకొచ్చింది.

‘గత విధానాన్ని సరళీకరించాలని మాకు సూచనలు అందాయి. క్రికెట్‌ కమిటీ వాటిని పరిగణనలోకి తీసుకొని కొత్త విధానం ప్రతిపాదించింది. ఇప్పుడు మ్యాచుల సంఖ్యతో సంబంధం లేకుండా పాయింట్లు లభిస్తాయి. కరోనా మహమ్మారి వల్ల అందుబాటులో ఉన్న పాయింట్ల ఆధారంగా ర్యాంకులు ఇచ్చాం. దానివల్లే ఫైనల్‌ జట్లను నిర్ణయించగలిగాం’ అని ఐసీసీ తాత్కాలిక సీఈవో జెఫ్‌ అలార్డిస్‌ అన్నారు.

ఐసీసీ రెండో ఛాంపియన్‌షిప్‌లో ఎక్కువ సంఖ్యలో టెస్టులున్న సిరీసులు తక్కువగానే ఉన్నాయి. భారత్‌, ఇంగ్లాండ్‌ మధ్య ఐదు టెస్టుల సిరీసులు, భారత్‌×ఆసీస్‌, ఇంగ్లాండ్‌×ఆసీస్‌ మధ్య నాలుగు టెస్టుల సిరీసులే పెద్దవి. ఆ తర్వాత అన్ని సిరీసుల్లోనూ 3 అంతకన్నా తక్కువే ఉన్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని
జాతీయ- అంతర్జాతీయ
మరిన్ని